వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియో
ఈ వీడియో చూస్తే మీకేమీ అర్థం కాలేదు కదా..? ఇదిగో ఈ వైట్ షర్ట్ వేసుకొని మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని గమనించండి. అలాగే ఈ బ్లూషర్ట్ వేసుకొని హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తిని కూడా అబ్జర్వ్ చేయండి. ఇద్దరూ పరస్పరం కోఆర్డినేషన్‌తో ఈ వ్యక్తి దగ్గర ఒక్క క్షణంలోనే ఫోన్ కొట్టేసి పరారయ్యారు. ముందుగా బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తి.. తన జేబులోంచి డబ్బులు తీసి కింద పడేసి.. తన వెనక ఉన్న టార్గెటెడ్ పర్సన్ దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. ఆ డబ్బులు నావేనేమో అని అతను కిందికి వంగి తీసుకుంటుండగా... ఈ వైట్ షర్ట్ పర్సన్ చూడడండి.. చేతిలో ఏదో కవర్‌తో కవర్ చేస్తూ.. సరిగ్గా అతను వంగిన టైంలోనే జేబులో మొబైల్ కొట్టేశాడు. వెంటనే అక్కడి నుంచి స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్లిపోయి.. అక్కడే బైక్ పై రెడీగా ఉన్న వాళ్ల మనిషితో ఉడాయించారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ హల్చల్ చేశారు. దృష్టి మరల్చి రెండు చోట్ల మొబైల్ ఫోన్‌లు చోరీ చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.