Huzurabad Byelections2021: హుజురాబాద్ లో భారీగా మోహరించిన కేంద్ర, రాష్ట్ర బలగాలు
హుజరాబాద్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం సిద్ధమైంది. అటు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం, ఇటు పోలీసు బలగాలు మోహరించి రేపటి ఎన్నికలకు హుజురాబాద్ సర్వసన్నద్ధంగా మారింది . రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ రాత్రి ఏడు గంటల వరకు జరగనుంది. ఇప్పటికే క్రింది స్థాయి సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి వారిని పలు ప్రాంతాలకు కేటాయించిన అధికార యంత్రాంగం వారికి రేపటి ఎన్నిక ప్రాధాన్యతను తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తి కరం గా మారిన ఎన్నిక కావడంతో, మరోవైపు ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిపై పూర్తి స్థాయిలో తమ దృష్టి కేంద్రీకరించడంతో ఏ చిన్న పొరపాటు జరగకుండా ఉండాలని ఎన్నికల అధికారులు ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.





















