Vivek Venkata Swamy: వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమా? చెన్నూర్ ఎమ్మెల్యేతో ఫేస్ 2 ఫేస్
అదిలాబాద్ జిల్లాలో మాల, మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి..? ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏమన్నారు..? త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని తెలుస్తోంది. మంత్రివర్గంలో వివేక్ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉందా..? ఈ అంశాలపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్..
రాష్ట్రంలో మాలల జనాభా 30 లక్షలు ఉందని.. గతంలో కేసీఆర్ కూడా మాలల జనాభా తక్కువ ఉందని అంటే తాను ఒప్పుకోలేదని గుర్తుచేశారు. మాలలు ఐక్యంగా ఉండి సత్తా చాటాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇందిరా గాంధీ హయాం నుంచి మాలలు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పారు. మాలలు బయటకు వచ్చి మాట్లాడకపోవడం వల్లనే వర్గీకరణ విషయంలో కొంతమంది కుట్రలు చేశారని.. సబ్ కమిటీ వేస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. దీనిపై తాను సీఎం రేవంత్ రెడ్డిని కోరానని అన్నారు. కులవివక్ష కారణంగానే ఇప్పటివరకు ఎస్సీ కాలనీల అభివృద్ధి జరగడం లేదని అన్నారు.