Cane Plant in Mulugu Forest | తెలంగాణకు తలమానికంగా అరుదైన వృక్ష జాతి కేన్ మొక్క | ABP Desam
శేషాచలం అటవీ ప్రాంతానికి ఎర్రచందనం ఎలా ప్రత్యేకమైన వృక్షమో...అలానే ములుగు జిల్లాలోనూ ఓ అరుదైన జాతి మొక్కలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అవే కేన్ మొక్కులు. కలామస్ రోటాంగ్ అని సైంటిఫిక్ గా, చాపతీగ అని స్థానిక భాషలో పిలుచుకునే ఈ మొక్కలు వెదురుజాతికి చెందినవే చాలా ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అలాంటి ఈ మొక్కలు ములుగు జిల్లాలో రామప్ప గుడి సమీప అటవీ ప్రాంతంలో కనిపిస్తుంటాయి.ఇంట్లో ఫర్నిచర్ తయారీకి, గృహోపకరణాలు, అలకంకరణ వస్తువుల్లో వాడే ఈ కేన్ మొక్కులు..తెలంగాణలో ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించవు. పాలంపేట, రామప్ప పరిసర ప్రాంతాల్లో అడవుల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. 45 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ అధికారులు వీటి పెరుగుదలను ఇక్కడ గుర్తించి రికార్డు చేయటం మొదలు పెట్టారు. 3 ఇంచుల వెదురుతో 20 నుండి 25 అడుగుల వరకూ ఈ మొక్కలు ఇక్కడ పెరుగుతున్నాయి.1953 లో ప్రొఫెసర్ ఖాన్ మొట్ట మొదటి సారిగా కేన్ మొక్కలను ములుగు జిల్లాలో గుర్తించారు. దీని ప్రాముఖ్యత తెలియడంతో 53 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని అటవీశాఖ అధికారులు జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తించారు. అప్పటి నుండి ఫారెస్ట్ అధికారులు రక్షిత ప్రాంతంగా కేన్ మొక్కలను కాపాడుతున్నారు. ఇప్పటి వరకు వీటిని నరకటం కానీ విక్రయించటం కానీ చేయలేదని చెబుతున్న ఫారెస్ట్ అధికారులు...అనేక పక్షిజాతులకు ఇవి ఆవాసాలుగా కూడా ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో కేన్ మొక్కులు ఉన్నట్లు ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ తెలిపారు..