అన్వేషించండి

KTR vs Revanth: ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Delhi Assembly Elections 2025 | ఎన్నికల్లో తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి కొత్త నాటకం మొదలుపెట్టాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ విమర్శించారు.

KTR slams cm Revanth Reddy over Delhi Assembly election Promises | హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను విడుదల చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తల్లికి బువ్వ పెట్టనోడు- చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావడానికి తెలంగాణలో 420  హామీలు ఇచ్చి గంగలో కలిపిన రేవంత్ రెడ్డి- ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో ఎగ్గొట్టి, ఢిల్లీకి హామీలా..

తెలంగాణలో నికృష్ట పాలన కొనసాగుతోందని, ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాగే చేయిస్తానని పులకేశి బయలుదేరాడని సీఎం రేవంత్ ను ట్రోల్ చేశారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉచిత కరెంటు ఎవరికి ఇచ్చారు ? -గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి ? అని ప్రశ్నించారు. హామీ ప్రకారం తెలంగాణలో రూ.2500 తీసుకుంటున్న మహిళలు ఎవరు ? పెళ్లిళ్ల సమయంలో తులం బంగారం అందుకున్న ఆడబిడ్డలు ఎవరు ? రైతు భరోసా రూ.7500 ఎక్కడ ఇచ్చారు ? వృద్ధులను మోసం చేసిన ఆసరా ఫించన్లు (Asara Pension) రూ.4000 చేసిందెక్కడ. రూ.5 లక్షల విద్యాభరోసా ఇచ్చారా, పోనీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అన్న హామీ ఏమైంది ? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు
పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఎన్నికల సమయంలో తెలంగాణలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు గాని పోయి ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు, ఏదో చేస్తాం అన్నట్లుగా ఢిల్లీలో హస్తం పార్టీ ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా ? అని మండిపడ్డారు. ఢిల్లీ గల్లీల్లో కాదు రేవంత్ రెడ్డి.. మీకు దమ్ముంటే ఉద్యోగాలు ఇచ్చామని మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు చూద్దాం. నవ్విపోదురు గాక, నాకేంటి సిగ్గు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని.. జాగో ఢిల్లీ జాగో అని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Also Read: Ponnala Laxmaiah: మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget