Naga Chaitanya: చేపల పులుసు వండిన అక్కినేని నాగచైతన్య... అదీ పుల్లల పొయ్యి మీద, వీడియో చూశారా?
Thandel Movie: తండేల్ రాజు పాత్రలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న సినిమా 'తండేల్'. విశాఖలో సినిమా షూటింగ్ జరిగిన టైంలో ఆయన చేపల పులుసు వండారు.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'తండేల్' (Thandel Movie). సముద్రంలో చేపల వేటకు వెళ్లే శ్రీకాకుళం (తీర ప్రాంతానికి చెందిన) యువకుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఒక్కోసారి ఒడ్డుకు రావడానికి రోజులు పడుతుంది. అప్పుడు భోజనం సంగతి ఏంటి? అంటే... చేపల వేటకు వెళ్లిన పడవలో అన్నం వండుకుని, సముద్రంలో పట్టిన చేపను పులుసు చేసుకుని తింటారు. మరి, చైతన్యకు చేపల పులుసు వండటం వచ్చా?
చేపల పులుసు వండిన నాగ చైతన్య!
మత్స్యకారుని పాత్ర చేయడం మాత్రమే కాదు... ఆ పాత్రలో అక్కినేని నాగ చైతన్య జీవించారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ సినిమా కోసం ఆయన శ్రీకాకుళం యాస నేర్చుకున్నారు. అంతే కాదు... విశాఖలో 'తండేల్' సినిమా షూటింగ్ జరిగిన సమయంలో... అక్కడ స్థానిక ప్రజల కోసం తన చేతులతో స్వయంగా చేపల పులుసు వండి వడ్డించారు చైతన్య. ఆ వీడియో విడుదల చేసింది సినిమా యూనిట్.
చేప ముక్కలకు ఉప్పు, పసుపు, అల్లం రాయడం మాత్రమే కాదు... పిల్లల పొయ్యి మీద స్వయంగా వంట చేసి పెట్టారు చైతన్య. తొలిసారి తాను చేపల పులుసు వండానని, ఒకవేళ పులుసు బాలేకపోతే ఏమీ అనుకోవద్దు అంటూ వినయంగా చెప్పడం ఒక్క చైతన్యకు మాత్రమే సాధ్యమైంది.
Also Read: 'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
యేటలో చేపలు పట్టేసాక..మంచి పులుసు ఎట్టేయాలి కదా ♨️
— Annapurna Studios (@AnnapurnaStdios) January 17, 2025
'Thandel Raju' aka Yuvasamrat @chay_akkineni cooks a lip-smacking 'Chepala Pulusu' for the locals during the shoot of #Thandel 😋
▶️ https://t.co/mMqh4GOpB3#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th 💥… pic.twitter.com/zM3bPpwV9X
ఫిబ్రవరి 7న థియేటర్లలోకి సినిమా
Thandel Release Date: నాగ చైతన్యకు జోడిగా 'తండేల్' సినిమాలో సాయి పల్లవి నటించారు. 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకం మీద 'బన్నీ' వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన 'శివ శక్తి...' పాటతో పాటు 'బుజ్జి తల్లి...' పాటకు వీక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఫిబ్రవరి 7న ఈ సినిమా థియేటర్లలో రానుంది.
Also Read: సైఫ్ అలీ ఖాన్ మీద ఎటాక్ జరుగుతుంటే కరీనా ఎక్కడ ఉంది? కత్తిపోట్ల నుంచి ఐసీయూలో సర్జరీ వరకు...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

