Attack on Cantonment MLA Sri Ganesh | ఎమ్మెల్యే శ్రీగణేష్ పై దాడి
కాంగ్రెస్ నేత కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పై కొందరు గుర్తుతెలియని దుండుగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వరినగర్‌లో బోనాల పండగకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అద్దాలు దించాలంటూ ఎమ్మెల్యే కారును వెంబడించి హంగామా చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ గన్‌మెన్‌ల నుంచి తుపాకీ సైతం యువకులు లాక్కునేందుకు యత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే వెంటనే అక్కడి నుంచి ఓయూ పీఎస్ వెళ్లారు. తన కాన్వాయ్ ను అడ్డుకుని తనపై దాడిచేసి చంపాలని చూశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై డీసీపీ బాలాస్వామి మాట్లాడుతూ.. ఆరు బైకులపై 13 మంది వ్యక్తులు వెళుతూ ఎమ్మెల్యే శ్రీగణేష్ కారుకు దారి ఇవ్వలేదు. దాంతో కారు డ్రైవర్ హారన్ కొట్టాడు. ఆ వ్యక్తులు బండ్లను రోడ్డుమీద నిలిపి ఎమ్మెల్యే వాహనంపై తిరగబడి దాడికి యత్నించారు. గన్ మెన్లు కిందకు దిగగానే ఆ దుండగులు విద్యానగర్ వైపు వెళ్లినట్లుగా వెల్లడించారు.





















