Vehicles Exhibition: హైటెక్స్‌లో విద్యుత్ వాహనాల ప్రదర్శన ప్రారంభం
ప్రపంచానికి ముప్పుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగం తప్పనిసరి అని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. హైటెక్స్ లో విద్యుత్ వాహనాల ప్రదర్శన ప్రారంభించిన ఆయన.. విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 138 కేంద్రాలు ఆరంభించామని, మరో 600 కేంద్రాల ఆరంభానికి ప్రతిపాదనలు చేశామన్నారు. 10 వేల వాహనాలు అందుబాటులోకి వస్తే ఏటా రూ.250 కోట్ల పెట్రోల్ దిగుమతులు ఆదా చేసినవారవుతామని చెప్పారు. విద్యుత్ వాహనాలను, తయారీదారులను కేసీఆర్, కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో పవర్ కట్స్ లేవు కాబట్టి ఛార్జింగ్ కోసం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.





















