Trolls on Coach Gambhir | గంభీర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ అయిపోయింది. కానీ ఫ్యాన్స్ అంతా కూడా ఇంకా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గురించే చర్చిస్తున్నారు. ఒక టెస్ట్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇద్దరు ప్లేయర్స్ కు ఇస్తారు. ఒకరు గెలిచిన టీం.. మరొకరు ఓడిన టీం నుంచి. గెలిచిన టీం నుంచి బెస్ట్ ప్లేయర్‌ను ఓడిన టీం కోచ్ సెలక్ట్ చేస్తారు. అలాగే ఓడిన జట్టు నుంచి బెస్ట్ ప్లేయర్ ను గెలిచిన టీం కోచ్ సెలెక్ట్ చేస్తారు.
ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ టీం నుంచి బెస్ట్ ప్లేయర్ ను సెలక్ట్ చేసే బాధ్యత గంభీర్‌పై పడింది. అలాగే ఇండియా నుంచి బెస్ట్ ప్లేయర్ ను సెలక్ట్ చేసే ఛాన్స్ ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కు వచ్చింది. ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ శుభ్‌మన్ గిల్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కోసం సెలక్ట్ చేశారు.
గంభీర్ ఇంగ్లాండ్ టీం నుంచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా హ్యారీ బ్రూక్ ను సెలక్ట్ చేశారు. దాంతో గంభీర్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ సిరీస్‌లో బ్రూక్ 481 పరుగులు చేశాడు. జో రూట్ 537 పరుగులు చేసాడు. బ్రూక్ కంటే కూడా జో రూట్ ప్రదర్శన చాలా బాగుంది. అయినా కూడా గంభీర్ బ్రూక్‌ను సెలెక్ట్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బ్రూక్ అవార్డు అందుకున్న తర్వాత “ఈ అవార్డుకు నా కంటే జో రూట్ ఎక్కువ అర్హుడు” అని చెప్పాడు. గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్లేయర్స్ ప్రదర్శన ఆధారంగా అవార్డులు ఇవ్వాలని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.





















