Team India Rejected Asia Cup | ఆసియా కప్ ను నిరాకరించిన టీమ్ ఇండియా
అందరు అనుకున్నట్టుగానే ఆసియా కప్ ను టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. పాకిస్తాన్ పై గెలవడంతో అది ఇంకా స్పెషల్ గా మారింది. ఈ టోర్నమెంట్ లో ఇరు జట్లు గొడవలు పడ్డారు.. రకరకాల సెలెబ్రేషన్స్ చేస్తూ కౌంటర్లు కూడా ఇచ్చుకున్నారు. 41 ఏళ్ల ఆసియా కప్ టోర్నమెంట్ హిస్టరీలో తొలిసారి ఈ సంవత్సరం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచులో ఎవరు ఊహించని విషయాలు జరిగాయి. అందుకు కారణం పహాల్గమ్ ఉగ్రదాడి. దాంతో రెండు జట్ల మధ్య ఉండే రైవల్రి మరింత పెరిగింది.
ఆసియా కప్ ఫైనల్ లో 9వ సారి గెలిచింది ఇండియా. కానీ కప్ ను మాత్రం రిజెక్ట్ చేసింది. ఇందుకు కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్ ఇస్తుండడమే. పాకిస్తాన్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వని టీమ్ ఇండియా... నఖ్వీ చేతుల మీదుగా కప్ ఎలా తీసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ బదులిస్తున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ, మెడల్స్ తీసుకోకుండానే ప్లేయర్స్ అంత సెలెబ్రేట్ చేసుకున్నారు.
నఖ్వీ చాలా సేపు ఎదురు చూసినా కూడా మనవాళ్లు మాత్రం పోడియం దెగ్గరికి కూడా వెళ్ళలేదు. ఫోన్లు చూస్తూ, ఫ్యామిలీతో ఫోటోలు దిగుతూ గ్రౌండ్ లో టైం పాస్ చేసారు. కొద్దీ సేపటి తర్వాత భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్ ప్రకటించారు. నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత ప్లేయర్స్ అంత పోడియం దగ్గరకు వచ్చి రోహిత్ శర్మ స్టైల్ లో కప్ లేకుండానే సెలెబ్రేట్ చేసుకున్నారు.





















