ఆసీస్‌తో సమరానికి సిద్ధం.. ప్లేయింగ్ 11 పైనే అందరి చూపు
భారత్ -ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన తర్వాత టీమ్ ఇండియా మొదటి వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ శుభమన్ గిల్ కు కెప్టెన్గా మొదటి వన్డే సిరీస్ కానుంది. చాలా గ్యాప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడనున్నారు. దాంతో.. మొదటి వన్డేలో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 ఏంటన్న చర్చ మొదలయింది.
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జోడీ వన్డేలలో ఓపెనింగ్ చేస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఏ జరగొచ్చు. అయితే ఇక్కడ ఓపెనర్ గా ఉన్న మరో ఆప్షన్ జైస్వాల్. కెప్టెన్ గా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో మంచి పేరు తెచ్చుకున్న శుబ్మన్ గిల్ తన మొదటి వన్డే సిరీస్లో కూడా అలాగే ఆడాలని ఆశిస్తున్నారు. విరాట్ కోహ్లీ మరోసారి నంబర్-3 స్థానంలో ఆడనున్నాడు.
మిడిల్ ఆర్డర్ లో శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ తో బలంగా కనిపిస్తుంది. అక్షర్ పటేల్, నితీష్ కుమార్ అల్ రౌండర్ గా బరిలోకి దిగుతారు. మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ ఆస్ట్రేలియా పిచ్లపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. ఇక మూడవ ఫాస్ట్ బౌలర్ కోసం ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా మధ్య పోటీ ఉంటుంది. మెయిన్ స్పిన్ బౌలర్ గా కుల్దీప్ యాదవ్ ఉండొచ్చు. ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ భారత్ యంగ్ టీమ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి.





















