T20 World Cup Records That Are in Danger | టీ20 ప్రపంచకప్‌లో బద్దలయ్యే రికార్డులు
2024 టీ20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధం అవుతోంది. సరిగ్గా రేపు ఈ సమయానికి మొదటి మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. వెస్టిండీస్, అమెరికా దేశాలు వేదికగా జరిగే ఈ టోర్నమెంట్‌లో కొన్ని రికార్డులు బద్దలు అవుతాయని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవేంటో చూద్దాం.
1. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఫోర్లు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో 111 ఫోర్లతో శ్రీలంక బ్యాటర్ మహేళ జయవర్ధనే టాప్‌లో ఉన్నాడు. అతని తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ 103 ఫోర్లతో ఉన్నాడు. మరో తొమ్మిది ఫోర్లు కొడితే కోహ్లీ... మహేళ రికార్డును బద్దలు కొడతాడు. ఈ టోర్నీలో ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ 86 ఫోర్లతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ 86 ఫోర్లతో ఐదో స్థానంలో ఉన్నారు. కాబట్టి మహేళ రికార్డు బ్రేక్ అవ్వడం అయితే పక్కా.
2. అత్యంత వేగవంతమైన సెంచరీ
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టాప్ 2 ఫాస్టెస్ట్ సెంచరీలు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ పేరు మీద ఉన్నారు. 47 బంతుల్లో ఒకసారి, 50 బంతుల్లో ఒకసారి టీ20 ప్రపంచకప్‌లో గేల్ సెంచరీలు సాధించాడు. గత కొన్ని సంవత్సరాల్లో టీ20 ఫార్మాట్‌లో వేగం బాగా పెరిగింది. కాబట్టి ఈసారి ఈ రికార్డు బ్రేక్ అవుతుందని అనుకోవచ్చు.