Mirabai Chanu: ఓ క్యూట్... వెయిట్ లిఫ్టర్‌ను చూసి మీరాబాయి చాను ఫిదా
టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి ఇప్పుడు రోల్‌మోడల్‌గా మారింది. చిన్న పిల్లలను కూడా ఆమె ఇన్‌స్పైర్ చేసింది. మీరాబాయి చానును అనుకరిస్తూ వెయిట్‌లిఫ్టర్ సతీష్ శివలింగం కూతురు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరాబాయిని టీవీలో చూస్తూ అచ్చం ఆమెలా చేసింది. మెడల్ ప్రెజంటేషన్‌లో చాను మెడల్ ధరించినట్టుగానే చిన్నారి కూడా తన మెడలో ఒక మెడల్ వేసుకొని ముసిముసిగా నవ్వింది. ఈ వీడియోను వెయిట్‌లిఫ్టర్ సతీష్ శివలింగమ్ స్వయంగా తన ట్విటర్‌లో షేర్ చేయగా.. మీరాబాయి చాను స్పందించారు. ఈ చిన్నారి భలేగా చేసింది... సో క్యూట్.. జస్ట్ లవ్ దిస్ అంటూ షేర్ చేసింది.





















