Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
ఫిఫా వరల్డ్ కప్ 2026లో గ్రూప్-Fలో భాగంగా జపాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ 51వ నిమిషంలో నెదర్లాండ్స్ కెప్టెన్ వర్జిల్ వాన్ డిజ్క్ పవర్‌ఫుల్ హెడర్‌తో ఖాతా తెరవగా, జపాన్ ప్లేయర్ కీటో నకమురా వెంటనే గోల్‌తో బదులిచ్చాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ మళ్ళీ ముందంజలోకి వెళ్ళినా, మ్యాచ్ ఆఖరి నిమిషంలో జపాన్ స్టార్ దైచి కమాడా డ్రామాటిక్ గోల్ కొట్టి మ్యాచ్‌ను సమం చేయడంతో స్టేడియం హోరెత్తిపోయింది.
మైదానంలో ప్లేయర్స్ ఆటతో ఆకట్టుకుంటే, స్టేడియంలో జపాన్ ఫ్యాన్స్ తమ సంస్కారంతో ప్రపంచం మనసు గెలుచుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత జపాన్ సపోర్టర్లు స్టేడియంలోనే ఉండి ప్రేక్షకులు వదిలేసిన చెత్తను క్లీన్ చేశారు. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ క్లీనింగ్‌లో ఒక దివ్యాంగ ఫ్యాన్ వీల్‌చైర్‌పై ఉంటూనే చెత్తను ఏరడం అందరినీ ఎమోషనల్ చేసింది. ప్రతి మెగా టోర్నీలో ఈ ట్రెడిషన్‌ను ఫాలో అవ్వడం మాకు దక్కిన గౌరవమని జపాన్ ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఆటతోనే కాకుండా తమ ప్రవర్తనతోనూ జపాన్ ఈ వరల్డ్ కప్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















