Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ గెలుపులో హీరో ఎవరంటే.. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అనే చెప్పాలి. కేవలం 17 బంతుల్లో 52 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన వైభవ్.. తన సక్సెస్ వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాడు.
మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ.. తన ఇన్నింగ్స్ క్రెడిట్ అంతా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కే దక్కుతుందని చెప్పాడు. "ప్రతీ బంతి తర్వాత జైస్వాల్ నాతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎక్కడ తగ్గాలి, ఎప్పుడు చెలరేగాలి అనేది ఆయనే నాకు గైడ్ చేశాడు. స్ట్రైకింగ్ నాకు ఇస్తూ, షాట్స్ ఆడమని నన్ను ప్రోత్సహించాడు" అని వైభవ్ తెలిపాడు. చిన్న లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు పవర్‌ప్లేలోనే గేమ్‌ను లాగేసుకోవాలనేది తమ ప్లాన్ అని వివరించాడు.
వైభవ్ తన పుట్టినరోజు గురించి చెబుతూ "నా 15వ పుట్టినరోజున నేను కేక్ కూడా కట్ చేయలేదు. ఎక్కడ ముఖానికి కేక్ పూస్తారేమోననే భయంతో త్వరగా నిద్రపోయాను" అని సరదాగా వ్యాఖ్యానించాడు. కోచ్‌లు కూడా తనకు అండగా ఉంటూ తన గేమ్ ఆడమని చెప్పినట్లు వెల్లడించాడు.
ట్రెండింగ్ వార్తలు






















