Surya Kumar Yadav POTM vs DC IPL 2025 | భార్య కోసం అవార్డు గెలిచిన SKY
ఢిల్లీ క్యాపిటల్స్ వాస్తవానికి ముంబై మ్యాచ్ ను మంచి గ్రిప్ తోనే స్టార్ట్ చేసింది. రోహిత్ ను 5 పరుగులకే ఔట్ చేయటం, రికెల్టెన్, విల్ జాక్స్, తిలక్ వర్మ ఇలా ముంబై స్టార్ బ్యాటర్లను ట్వంటీస్ లోనే రిస్ట్రిక్ చేయటం, హార్దిక్ పాండ్యా మూడు పరుగులకే ఔట్ ఇలా మ్యాచ్ ఆల్మోస్ట్ ఎండ్ దాకా ఢిల్లీదే ఆధిపత్యం. అసలు పాండ్యా ఔట్ అయ్యే టైమ్ కి ముంబై స్కోరు 17ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 123పరుగులు మాత్రమే. ఆ దశలో మహా అయితే ముంబై 150 కొడితే ఎక్కువ అంటే 180పరుగులు చేయగలిగింది. రీజన్ ఆఖర్లో మెరుపులు మెరిపించిన నమన్ ధీర్ తో కలిసి సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టిన విధానం. మిగిలిన వాళ్లు ఆడినా ఆడకున్న సూర్య మాత్రం 43 బాల్స్ లో 7ఫోర్లు 4 సిక్సర్లతో 73పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లు డామినేట్ చేసిన చోట సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేసిన సూర్యు కుమార్ యాదవ్ లాస్ట్ ఓవర్ లో చమీరాను టార్గెట్ చేసి రెండు సిక్సులు రెండు ఫోర్లతో ఇరవై పరుగులు రాబట్టి ముంబై కు ఊహించని స్కోరు ను సెట్ చేశాడు. ఫలితంగా షాక్ తిన్న ఢిల్లీ ఆ షాక్ ను బ్యాటర్లు కూడా కొనసాగించటంతో 121 పరుగులకే ఆలౌట్ అయిపోయి ముంబైకి 59 పరుగుల తేడాతో విక్టరీతో పాటు ప్లే ఆఫ్స్ బెర్తును పువ్వుల్లో పెట్టి ఇచ్చింది. మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్టెల్లార్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ యాదవ్ కే దక్కగా తన వీర విజృంభణ వెనుక రీజన్ కూడా చెప్పాడు సూర్య. వర్షంలో తడవకుండా తనతో పాటు హర్షకు గొడుగు పెట్టిన సూర్య కుమార్..13 గేమ్స్ గడిచిపోయాయి ముంబై గొప్పగా ఆడుతోంది. అన్ని రకాలు అవార్డులు వచ్చాయి కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాలేదు మీకు అని అడిగిందట తన భార్య. అందుకే ఈ గేమ్ మీద మరింత ఫోకస్ తో ఆడానన్న సూర్య కుమార్..తనకు నచ్చినట్లుగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవటం..తనకు గిఫ్ట్ ఇవ్వటం మర్చిపోలేని అనుభూతి అంటూ స్వీట్ స్టోరీ చెప్పాడు సూర్య కుమార్ యాదవ్.





















