Rohit Sharma vs PBKS Qualifier 2 IPL 2025 | అయ్యర్ ఈ ప్లాన్ వర్కవుట్ చేస్తే గెలిచేస్తాడు | ABP Desam
రెండు వేర్వేరు జట్లకు ఐపీఎల్ ట్రోఫీలు గెలిపించిన కెప్టెన్ గా నిలవాలంటే శ్రేయస్ అయ్యర్ ముందు ఈ రోజు మిగిలి ఉన్న ఆప్షన్ ఒక్కటే . ముంబై ఇండియన్స్ ని క్వాలిఫైయర్ 2 లో ఓడించి ఫైనల్ కి వెళ్లి ఆర్సీబీ మీద గెలవటం. ఇది జరగాలంటే అయ్యర్ చేయాల్సిన పని ఒక్కటే. రోహిత్ శర్మ షర్ట్ తడవకుండా చూడటం. అదేంటీ అని మీరు అనుకోవచ్చు కానీ..ఈ సీజన్ ను జాగ్రత్తగా గమనించండీ..రోహిత్ శర్మ శరవేగంగా గేర్లు మార్చేస్తున్నాడు. సీజన్ ముందు నుంచి నిదానంగా ఆడుతూ ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యాడు ఈ సీజన్ అనిపిస్తూ వచ్చిన రోహిత్ శర్మ…సీజన్ చివరికి వచ్చేసరికి ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నం లా తయారయ్యాడు. మొన్న గుజరాత్ టైటాన్స్ మీద చూశాం..ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆడుతూ పాడుతూ 81 పరుగులు చేసేశాడు. అసలు ఈ సీజన్ లో ముంబై విన్నింగ్ స్ట్రీక్ మొదలు పెట్టిందే రోహిత్ శర్మ బ్యాటింగ్ కారణంగా చెన్నై, హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో రెండు టీమ్స్ మీద 70 పరుగులు చేసిన రోహిత్ ముంబైకి సీజన్ లో ప్లే ఆఫ్స్ కి తీసుకురావటం లో కావాల్సినంత ఇగ్నిషన్ అందిస్తే మొన్న తనే ఎలిమినేటర్ లో ముంబై గెలిచేలా చేసి ఈ రోజు క్వాలిఫైయర్ 2 లో పంజాబ్ మీద పోటీ పడే పొజిషన్ కు తీసుకువచ్చాడు. ఈ రోజు కూడా హిట్ మ్యాన్ చెలరేగాడా ఇక పంజాబ్ కు అంతే సంగతులు. తనకు రికార్డులు పట్టవు. సెల్ఫ్ లెస్ బ్యాటింగ్ ఆడతాడు. స్టార్టింగ్ ఓవర్లలోనే సిక్సర్లు కొడుతూ కాస్త టైమ్ తీసుకున్నా జోరు పెంచేస్తాడు. సో రోహిత్ శర్మను అవుట్ చేస్తే తనకు చెమటలు పట్టి షర్ట్ తడిచేలోపు అవుట్ చేసేయాలి. క్రీజులో కుదురుకున్నాడా పెవిలియన్ లో పాంటింగ్ ఏడ్చేలా...గ్రౌండ్ లో అయ్యర్ అయ్యోరామా అనుకునేలా చేయగల సముర్థుడు రోహిత్ శర్మ. బై దవే ఈ సీజన్ లో రోహిత్ శర్మ 410 పరుగులు చేశాడు ప్రస్తుతానికి అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గడచిన 9 ఏళ్లలో రోహిత్ శర్మ కొట్టిన అత్యధిక పరుగులు ఈ సీజన్ లోనే. అర్థం చేసుకోండి హిట్ మ్యాన్ ను ఆపటం పంజాబ్ కు ఎంత చారిత్రక అవసరమో.





















