RCB Into Playoffs | RCB vs CSK Highlights | 30కి పైగా మ్యాచ్ ఫలితాలు RCB వైపే..ఇదెక్కడి మాస్ రా మావ.
RCB Into Playoffs | RCB vs CSK Highlights | ఎంత బలహీనుడైనప్పటికీ ప్రకృతి వాడికి సపోర్ట్ చేస్తుంటే...ఆపడం ఎవరి తరం కాదు. సేమ్ ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ విషయంలోనూ అదే జరిగింది. ఫస్ట్ ఆఫ్ లో 8 మ్యాచుల్లో కేవలం ఒకటే విజయం..7 ఓటములు. పాయింట్స్ టేబుల్ లో 10వ ప్లేస్. కట్ చేస్తే వరుసగా మిగతా 6 మ్యాచుల్లో 6 విజయాలు. చూస్తే..4వ ప్లేస్ లో దర్జాగాసెటిల్ ఐంది బెంగళూరు. దీనికి కారణం కోహ్లీ,డూప్లెసిస్, విల్ జాక్స్ మాత్రమే కాదు. మొత్తం సిచ్యూవేషన్స్ ఆర్సీబీకి కలిసి వచ్చాయి. ఆర్సీబీ 8 మ్యాచుల తరువాత చేతిలో 6 మ్యాచులే ఉన్నాయి. కానీ, సీజన్ లో ఇంకో 30ప్లస్ మ్యాచులు ఉన్నాయి. ఆర్సీబీ 6కు6 గెలిచినప్పటికీ..మిగతా టీమ్స్ కూడా ప్రెడిక్షన్ టేబుల్ ప్రకారం గెలవాలి. ఓడాలి. ఎంత లక్ ఉంటే ఆ 30 మ్యాచులు బెంగళూరుకు ఫేవర్ గా వస్తాయి చెప్పండి. టాప్ లో రాజస్థాన్ వరుసగా 4 మ్యాచులు ఓడిపోవడం, చెన్నై సెంకడ్ ఆఫ్ లో 2 విజయాలే సాధించడం..లక్నో వరుస ఓటములు, ముంబయి 4 విజయాలకే పరిమితమవడం ఇలా ఆల్మోస్ట్ 30కిపైగా మ్యాచుల రిజల్ట్స్ ఆర్సీబీ ప్రెడిక్షన్ టేబుల్ కు అనుకూలంగా వచ్చాయి. నిన్న CSkతో జరిగిన మ్యాచులోనూ అంతే.
భారీగా పడుతుందనుకున్న వర్షం పడలేదు. ఫామ్ లో లేని మ్యాక్స్ వెల్ 4 బాల్స్ లో 16 పరుగులు కొట్టి..బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే వికెట్ తీసుకున్నాడు. డూప్లెసిస్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. లాస్ట్ ఓవర్ లో 18 పరుగులు కట్టడి చేశారు. ఇలా ఎటు చూసి పంచభూతాలు ఆర్సీబీకి సపోర్ట్ చేయడంతో అసాధ్యమనుకున్న కలను నిజమైంది. కప్ కు మూడు అడుగుల దూరంలో ఆర్సీబీ నేడు నిల్చుంది.