PBKS vs MI Match Preview IPL 2025 | పంజాబ్ పై ముంబై గెలవాలని కొహ్లీ ప్రత్యేక పూజలు
ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్స్ బెర్త్ అయితే జమానాకు ముందే కన్ఫర్మ్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 2 లో ప్లేస్ కోసం ఎడ తెగని పోరాటం చేస్తోంది. అనూహ్యంగా హైదరాబాద్ ఇచ్చిన షాక్ తో కంగుతిన్న టీమ్ RCB ఆ తర్వాత టాప్ 2 ప్లేస్ కావాలంటే గుజరాత్, పంజాబ్ మ్యాచ్ లు ఓడిపోవటం తప్పనిసరి కావటంతో తన ప్రియమైన శత్రువులైన చెన్నై, ముంబై లు గెలవాలని ప్రార్థనలు చేసింది. తమ్ముడు కొహ్లీ పై అభిమానం చూపించిన అన్న ధోనీ నిన్న టాప్ 1 జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ పై విక్టరీ సాధించి RCB కి పరోక్షంగా హెల్ప్ చేశాడు. ఆ వరుసలో ఇవాళ రోహిత్ శర్మ వంతు వచ్చింది. హిట్ మ్యాన్ కెప్టెన్ కాకపోయినా హార్దిక్ పాండ్యా ఆధ్వర్యంలోని ముంబై ఇండియన్స్ ఈరోజు పంజాబ్ పై ముంబై గెలవాలని తప్పనిసరిగా కోరుకుంటుంది. ఎందుకంటే అలా గెలిస్తే పంజాబ్ 17 పాయింట్ల మీదే ఉంటుంది. గుజరాత్, ముంబై 18 పాయింట్లతో ఉంటాయి. తమ చివరి మ్యాచ్ ను RCB లక్నో మీద గెలిచేస్తే 19 పాయింట్లతో ఆర్సీబీ టాప్ 1 జట్టుగా ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది...గుజరాత్, ముంబైల్లో ఏది బెటర్ రన్ రేట్ తో ఉంటే ఆ జట్టు బెంగుళూరు తర్వాతి స్థానంలో టాప్ 2 లో సెటిల్ అయ్యి RCB తో ప్లే ఆఫ్ 1 మ్యాచ్ ఆడటానికి సిద్ధమౌతుంది. సో ఇంత పెద్ద ప్లాన్ వేసుకున్న RCB ఇవాళ ముంబై గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. పంజాబ్ గెలిస్తే మాత్రం 19 పాయింట్లతో పంజాబ్ ఫస్ట్ ప్లేస్ కి వెళ్లిపోతుంది. RCB ఆఖరి మ్యాచ్ లో LSG మీద గెలిస్తేనే సెకండ్ ప్లేస్ సాధిస్తుంది ఓడితే అంతే సంగతులు..ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుకోవాల్సిందే. అయితే ముంబై ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే పంజాబ్ ను కచ్చితంగా ఓడించగలదు అలా అని పంజాబ్ ను తక్కువ అంచనా వేయలేం. ముంబైలో రోహిత్ శర్మ, రికెల్టెన్ మొదలుకుని సూర్య కుమార్ యాదవ్, విల్ జాక్స్, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ ఇలా అందరూ పిచ్చ ఫామ్ లో కనిపిస్తున్నారు. బౌలింగ్ లో ఎలానో బుమ్రా, బౌల్ట్ లాంటి లెజెండ్స్ ఉన్నారు. ఇక అటు పంజాబ్ లో శ్రేయస్ అయ్యర్ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. ప్రభ్ సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య మరోసారి తమ టచ్ చూపించాల్సిన అవసరం ఉంది. మార్కస్ స్టాయినిస్ జాయిన్ అవ్వటం ఆల్ రౌండర్ మెరుపులు పంజాబ్ కి కొండంత బలాన్ని ఇచ్చేవే. చూడాలి ఈ రోజు సూపర్ ఫైట్ లో గెలిచి టాప్ 2 బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే జట్టు ఏదో





















