Kohli Gayle ABD E Sala Cup Namdu | IPL 2025 కప్ కొట్టాక అరిచి మరీ చెప్పిన కోహ్లీ
ఇన్ని సంవత్సరాల పాటు ఏ ట్రోఫీ లేదని ప్రత్యర్థి జట్లు వెక్కిరించాయో..ఇన్ని సంవత్సరాల పాటు ఏ ఛాంపియన్ షిప్ సాధించలేకపోయారని వేరే జట్ల అభిమానులు చిన్న చూపు చూశారో..వాటన్నింటికి సమాధానం చెప్పేశాడు విరాట్. ఒక్కడుగా కాదు తన దోస్తులు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తో కలిసి మరీ. మ్యాచ్ ముగిసిన తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్దూ కోహ్లీ, గేల్, డివిలియర్స్ ను ముగ్గురిని కలిపి ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ 2011, 2016 ఫైనల్స్ లో తమ ముగ్గురం చివరి మెట్టు వరకూ వచ్చి ఆగిపోయామని గుర్తు చేశాడు. అప్పుడు కప్ గెలవకపోయినా సరే ఇన్నేళ్ల పాటు ఆర్సీబీ సాగించిన జర్నీలో ఈ ఇద్దరితో తన ప్రయాణం చాలా గొప్పదన్న కోహ్లీ అందుకే ఈ ఫైనల్ మ్యాచ్ ను గేల్, డివిలియర్స్ చూడాలని బలంగా కోరుకున్నానన్నాని చెప్పాడు. అందుకే ట్రోఫీ సాధించిన మరుక్షణమే తనకు డివిలియర్స్ కనపడగానే ఎమోషనల్ అయ్యాయని చెప్పిన కోహ్లీ ఈ ఇద్దరితో కలిసే కప్పు తీసుకుంటానని సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పాడు. ట్రోఫీ తీసుకునే సమయంలో గేల్, డివిలియర్స్ కు ఆర్సీబీ జెర్సీ వేయించి మరీ స్టేజ్ మీదకు పిలిచి వాళ్లిద్దరి కలిసి ట్రోఫీని షేర్ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు కోహ్లీ. అంతే కాదు గేల్, డివిలియర్స్ కు కన్నడలో ఈ సాలా కప్ నమ్దు అని నేర్పించి మరీ వాళ్లిద్దరితో కలిసి ఈ సాలా కప్ నమ్దు అంటూ అరిచి మరీ తము సాధించిన విజయాన్ని తన పాత దోస్తులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.





















