KL Rahul Century IPL 2025 | సెకండాఫ్ లో దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ లా DC
ఈ ఐపీఎల్ సీజన్ ను ఘనంగా ప్రారంభించింది ఢిల్లీ క్యాపిటల్స్. మొదటి ఆరు మ్యాచుల్లో ఢిల్లీ ఓడిపోయింది కేవలం ఒక్కటంటే ఒకటే మ్యాచ్ అది కూడా ముంబై ఇండియన్స్ మీద. అలాంటిది సెకండాఫ్ వచ్చేసరికి ఏంటో తెలియని దరిద్రం ఢిల్లీని చుట్టేసింది. లాస్ట్ ఐదు మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్కటీ కూడ గెలవలేదు ఢిల్లీ. ఆర్సీబీ, కేకేఆర్ ల మీద మ్యాచ్ లు ఓడిపోయిన ఢిల్లీ..హైదరాబాద్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ అయితే ఉగ్రదాడుల కారణంగా బ్లాక్ అవుట్ పాటించటంతో అర్థాంతరంగా ఆగిపోయింది. దాని మీద ఏ డెసిషనూ తీసుకోని ఐపీఎల్ ఆ మ్యాచ్ ను అలాగే వదలేసింది. సరే మనకెందుకు మిగిలిన మూడు మ్యాచులు గెలిచేసి ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోదాం అనుకుంటే నిన్న గుజరాత్ ఊహించలేని దెబ్బ కొట్టింది. కేఎల్ రాహుల్ ఓపెనర్ అవతారం ఎత్తి అరివీర భయంకరంగా ఆడి సెంచరీ బాదినా అది గుజరాత్ కి సరిపోలేదు. సింగిల్ హ్యాండ్ తో సాయి సుదర్శన్, గిల్ ఉఫ్ మని ఊదేశారు ఆ స్కోరును. పదివికెట్ల తేడాతో ఓడిపోయింది డిల్లీ. ఇక ఢిల్లీ ప్లే ఆఫ్స్ కి వెళ్లలాంటే వేరే సమీకరణాలతో సంబందం లేకుండా తనకు మిగిలిన ముంబై, పంజాబ్ మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే. 21న ముంబైతో జరగబోయే మ్యాచ్ లో ఢిల్లీ ఓడిందా ఇక ఇంటికే. గెలిస్తే పంజాబ్ మీదా విజయం సాధించాలి. ఎందుకంటే ఇప్పటికే ముంబైకి ఓ పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి..ఢిల్లీ రెండు మ్యాచులు గెలవటం అవసరం. ముంబై మీద గెలిచి పంజాబ్ మీద ఓడితే...ముంబై కూడా అలానే పంజాబ్ చేతిలో ఓడిపోవాలని ఢిల్లీ కోరుకోవాలి. చూద్దాం..ఈ సీజన్ లో ఢిల్లీ ఎలాంటి క్లైమాక్స్ ఇవ్వనుందో.





















