KKR vs SRH IPL 2024 Final Preview | గంభీర్ తోడుగా అయ్యర్..కమిన్స్ అండ్ కో ను కంట్రోల్ చేస్తాడా.? | ABP Desam
మ్యాచ్ గెలిచాక మాట్లాడడు. గెలిచేముందు ఓడిస్తాను సైలెంట్ చేస్తాను అని చెప్పి మరీ దాన్ని చేసి చూపిస్తాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్టైలే అది. అదేదో ఆటిట్యూడ్ కాదు. వాళ్ల గేమ్ మీద వాళ్లకున్న కాన్ఫిడెన్స్ అది. అలాగే టీమిండియా చేతుల్లో నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను, వన్డే వరల్డ్ కప్ ను తన్నుకుని వెళ్లిపోయాడు ప్యాట్ కమిన్స్. ఇప్పుడు ఆ వరల్డ్ కప్ పరాభవానికి కసి తీర్చుకునే సమయం వచ్చిందంటున్నారు కోల్ కతా ఫ్యాన్స్. ఏ ఇండియన్ ఆడియెన్స్ ని సైలెంట్ చేస్తానని చేసి వరల్డ్ కప్ తన్నుకుని పోయాడో అదే ఇండియన్ ఫ్యాన్స్ ముందే... ఓటమి బాధ ఎలా ఉంటుందో ప్యాట్ కమిన్స్ కి రుచి చూపిస్తామంటున్నారు కోల్ కతా నైట్ రైడర్స్. సైలెన్సర్స్ నే సైలెంట్ అయిపోయేలా చేయటం కంటే కిక్ ఏమంటుందంటూనే ఈ సీజన్ లో KKR చూపిస్తున్న ఫామ్ కి ఫైనల్ మ్యాచ్ ఓ గ్రేట్ ట్రిబ్యూట్ అవుతుందనే ఎక్స్ పెక్టేష్స్ తో ఉన్నారు. లీగ్ స్టేజ్ లో ఓసారి, క్వాలిఫైయర్స్ 1 లో ఓసారి ఇదే సన్ రైజర్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ చిత్తు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గంభీర్ మెంటార్ గా తన పాత టీమ్ కోల్ కతా తో కలిసి దగ్గర నుంచి అనేక మార్పులతో ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో KKR ఫైనల్ వరకూ దూసుకు వచ్చేసింది. ఓపెనర్ గా సునీల్ నరైన్ సూపర్ సక్సెస్ కావటం దగ్గర నుంచి మొదలుపెడితే..సన్ రైజర్స్ బ్యాటర్ హెడ్ స్టంప్స్ ను గాల్లోకి లేపి తనేంటో ఘనంగా చాటుకున్న మిచెల్ స్టార్క్ వరకూ కూడా KKR ప్లేయర్లంతా మంచి టచ్ లో కనిపిస్తున్నారు. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఈ ఒక్క ఫైనల్లోనూ జూలు విదిలిస్తే KKR కు మూడో సారి ఐపీఎల్ ట్రోఫీ ని అందించటంతో పాటు వరల్డ్ కప్ లో టీమిండియా కు ప్యాట్ కమిన్స్ చేసిన పరాభవానికి గంభీర్ తోడుగా శ్రేయస్ అయ్యర్ సమాధానం ఇవ్వాలని KKR ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.