Jitesh Sharma Helmet Throwing Celebration | LSG మీద గెలిచిన తర్వాత RCB కెప్టెన్ ఎందుకు ఇలా చేశాడంటే
నిన్న ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ అద్భుత పోరాటంతో బెంగుళూరు జట్టును క్వాలిఫైయర్ 1 కి తీసుకువెళ్లాడు. 228పరుగులను ఛేజ్ చేసిన తర్వాత జితేశ్ తన హెల్మెట్ ను తీసి నేలకొసి కొడుతున్నట్లుగా ఓ ఫోజ్ ఇచ్చాడు గమనించే ఉంటారు. ఎందుకు ఇలా చేశాడని తెలియని వాళ్ల కోసం ఈ వీడియో. ఈ సెలబ్రేషన్ వెనుక ఓ పాత పగ ఉంది ఆర్సీబీకి. 2023 ఐపీఎల్ లో ఇదే లక్నోకి, ఆర్సీబీకి జరిగిన ఓ క్రూషియల్ మ్యాచ్ అది. ఆ మ్యాచ్ లో 213 పరుగులను టార్గెట్ ఛేజ్ చేసే క్రమంలో చివరి బంతికి ఒక పరుగు తీయాల్సిన పరిస్థితి లక్నోకి ఉంటుంది. అప్పటికే లక్నో 9వికెట్లు పడిపోయి ఉంటాయి. హర్షల్ పటేల్ బౌలింగ్ లో ఆవేశ్ ఖాన్ స్ట్రైకింగ్ లో ఉంటే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో బిష్ణోయ్ ఉంటాడు. చివరి బంతి వేయకుండా హర్షల్ పటేల్ మన్కడింగ్ కి ట్రై చేయటం...అంపైర్ నాటౌట్ గా ప్రకటించటంతో కాసేపు హడావిడి నెలకొంటుంది. ఆ చివరి బంతిని హర్షల్ మళ్లీ వేయాల్సి రాగా..ఈ సారి కనీసం బాల్ ను టచ్ కూడా చేయని ఆవేశ్ ఖాన్ రన్ కి వచ్చేసి కంప్లీట్ చేసి లక్నోను గెలిపించేస్తాడు ఆ తర్వాత తన హెల్మెట్ తీసి నేలకేసి కొడతాడు. ఇది అప్పట్లో ఆర్సీబీ ఫ్యాన్స్ కి మంటెత్తిపోయేలా చేసింది. మహామహులే వదిలిపెట్టకుండా ఎవ్వడి లెక్కలు వాడికి అప్పగించేసే ఆర్సీబీ లాంటి టీమ్ మీద ఆవేశ్ ఖాన్ లాంటి ఓ చిన్న కుర్రాడు చేసిన ఓవరాక్షన్ అది. ఆ తర్వాత నుంచి లక్నో మీద మ్యాచ్ అంటే చాలు ఆవేశ్ ఖాన్ ఉంటే ఇలానే టార్గెట్ చేసి ఆడతారు. నిన్న కూడా అంతే. ఆవేశ్ ఖాన్ చూస్తున్నాడనే జితేశ్ శర్మ మ్యాచ్ గెలిపించగానే హెల్మెట్ తీసి నేలకేసి కొడుతున్నట్లుగా సెలబ్రేట్ చేశాడు. మేం ఏదీ మర్చిపోయం అన్నీ గుర్తు పెట్టుకుంటాం..ఎవ్వడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేస్తాం అనే ఆర్సీబీ కల్ట్ మేల్ ఇగో నుంచి పుట్టిన సెలబ్రేషన్స్ ఇవన్నీ. దాన్ని నిన్న కెప్టెన్ జితేశ్ కంటిన్యూ చేశాడు అంతే.





















