Ishan Kishan 94 Runs vs RCB IPL 2025 | రెండు నెలల తర్వాత ఆడిన ఇషాన్ కిషన్
నిన్న ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ ను 42పరుగుల తేడాతో గెలుచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. నిన్న డేట్ 23 మే. నిన్న జరిగింది హైదరాబాద్ కు ఈ సీజన్ లో 13వ మ్యాచ్ మ్యాచ్. అంటే ఇంకొక్క మ్యాచ్ మాత్రమే మిగిలింది. సరిగ్గా ఇదే డేట్ న రెండు నెలల క్రితం మార్చి 23న ఈ ఐపీఎల్ సీజన్ లో తమ జర్నీని ప్రారంభించింది సన్ రైజర్స్ హైదరాబాద్. మార్చి 23న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. 47 బాల్స్ లో 106పరుగులు చేసి 286 పరుగుల భారీ స్కోరును హైదరాబాద్ బాదేలా చేసింది ఇషాన్ కిషన్. హైదరాబాద్ కు ఆడిన మొదటి మ్యాచే సెంచరీ బాది తనను వదులుకున్న ముంబైకి గుణపాఠం చెప్పటంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ కథ అడ్డం తిరిగింది. ఫస్ట్ మ్యాచ్ లో 286 కొట్టారు. ఈ సారి 300 పరుగుల రికార్డు బ్రేక్ చేయటం SRH పక్కా అనుకుంటున్న టైమ్ లో వరుస పరాజయాలతో ఆరెంజ్ ఆర్మీ డీలా పడింది. మొత్తంగా ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు 7 పరాజయాలు 1నో రిజల్ట్ మ్యాచ్ తో 11 పాయింట్లు సాధించిన SRH ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్ లో 8వ ప్లేస్ లో ఉంది. ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయిన ఆరెంజ్ ఆర్మీకి ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్ తో ఆర్సీబీపై మంచి విక్టరీ ని అందించాడు. సరిగ్గా రెండు నెలల తర్వాత మళ్లీ అదే డేట్ లో నిన్న 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలవటంతో పాటు ఆర్సీబీ పై 42 పరుగుల తేడాతో విజయం సాధించేలా కీలకపాత్ర పోషించాడు. సో మళ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇషాన్ కిషన్ కే దక్కింది. అలా ఇషాన్ కిషన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు వచ్చిన రెండు డేట్స్ ఒకటే కావటం అది కూడా రెండు నెలల గ్యాప్ ఉండటం కాకతాళీయమే అయినా RCB టాప్ 2 అవకాశాలకు మాత్రం ఆరెంజ్ ఆర్మీ భారీగానే గండి కొట్టింది.





















