IPL 2025 Uncapped Young Players | ఐపీఎల్ 2025లో ఐపీఎల్లో మెరిసిన కుర్రాళ్లు వీళ్లే | ABP Desam
మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఐపీఎల్ 2025 సీజన్ అయితే ముగిసిపోయింది. ఈ సీజన్ మొత్తంలో అందర్నీ ఆకట్టుకుంది యంగ్ ప్లేయర్స్ మాత్రమే. ఐపీఎల్ లో అవకాశం దొరకడమే చాలా కష్టం. దొరికిన ఛాన్స్ ని అందిపుచ్చుకొని ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబర్చి ఫ్యూచర్ క్రికెట్ టీం మేమె అంటూ చెప్పకనే చెప్పేసారు ఈ యంగ్ క్రికెటర్స్. వీరి కాంట్రిబ్యూషన్ తమ టీమ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాయి కూడా.
ఐపీఎల్ లో యంగ్ ప్లేయర్స్ అంటే ఇప్పుడు గుర్తు వస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల ఈ కుర్రాడు తన ప్రదర్శనతో అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఎన్నో రికార్డులను కూడా బద్దలకొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతి తక్కువ బాల్స్ లోనే సెంచరీ కూడా చేసాడు. అశుతోష్ శర్మ ఐపీఎల్ 2025లో బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. దిల్లీ క్యాపిటల్స్‌కు ఫినిషర్‌గా ఎన్నో ఇంపార్టెంట్ మ్యాచ్‌లు గెలిపించాడు. పంజాబ్ కింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ప్రతి మ్యాచ్ లో తన బాటింగ్ స్టైల్ తో సీనియర్స్ ప్లేయర్స్ ని కూడా ఆశ్చర్య పరిచాడు. 179.25 స్ట్రైక్ రేట్‌తో అపోజిట్ టీమ్స్ కి ప్రాబ్లెమ్ గా మారాడు. ఓపెనర్ గా వచ్చి మ్యాచ్ ఫినిష్ చేసి పంజాబ్ కింగ్స్ టీంకి కీ ప్లేయర్స్ గా మారిపొయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో తమ ఫ్యాన్స్ కి నిరాశే మిగిల్చినా యంగ్ ప్లేయర్స్ తో ఫ్యాన్స్ కి నెక్స్ట్ సీజన్ పై ఒక క్లారిటీ ఇచ్చింది. అందులో ముందు వినిపిస్తున్న పేరు ఆయుష్ మాత్రే. CSK క్యాప్టయన్ రుతురాజ్ కి ఇంజ్యూరీ అవడంతో అనుకోకుండా పిక్చర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు 17 ఏళ్ల ఆయూష్ మాత్రే. LSG ప్లేయర్ దిగ్వేష్ రాఠి తన చేష్టలతో బాగా వైరల్ అయ్యాడు. వికెట్ తీసి తన సిగ్నేచర్ స్టైల్లో సెలెబ్రేషన్స్ చేస్తూ అందర్నీ షాక్ కూడా గురిచేశాడు. ఎన్ని సార్లు కాంట్రోవర్సి టాపిక్ గా మారిన దిగ్వేష్ అవసరమైన సమయంలో టీంకి వికెట్స్ అందించాడు.





















