IPL 2025 RCB vs KKR Preview | చిన్నస్వామి స్టేడియంలో RCB vs KKR మ్యాచ్
ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభమవుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల నేఫధ్యంలో హఠాతుగా ఆగిన మ్యాచులు నేటితో ప్రారంభం కానున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో RCB vs KKR మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే, ప్లేఆఫ్స్ కు వెళ్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2015 నుంచి ఈ గ్రౌండ్ లో RCB కోల్‌కతాతో వరుసగా ఓడిపోతూనే ఉంది. ఇప్పుడు బెంగళూరు ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే 10 సంవత్సరాల చరిత్రను మార్చాలి.
ఈ మైదానంలో ఆడిన చివరి 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా ఆర్‌సీబీపై విజయం సాధించింది. 2015 తర్వాత ఆర్‌సీబీ వారి హోమ్ గ్రౌండ్ లో ఒక్కసారి కూడా కేకేఆర్‌ను ఓడించలేకపోయింది. ఈ సీజన్‌లో RCB 17 సంవత్సరాల తర్వాత చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, 10 సంవత్సరాల తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించింది. ఇదే విధంగా ఇప్పుడు kkr ని కూడా ఓడించాలని చూస్తుంది.
ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో చిన్నస్వామి స్టేడియం తెల్ల సముద్రంగా మారనుంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేఫధ్యంలో RCB ఫ్యాన్స్ అంతా వైట్ డ్రెస్సెస్ వేసుకొని విరాట్ కోహ్లీకి టెస్ట్ క్రికెట్ ఫేర్వెల్ ఇవ్వనున్నారు.





















