GT vs LSG Match Highlights IPL 2025 | సంజీవ్ గోయెంకా సపోర్ట్ రిజల్ట్ ఇచ్చిందా..?
ఈ ట్వీట్ మూడు రోజుల క్రితం లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తన అకౌంట్ లో పోస్ట్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మీద మ్యాచ్ ఓడిపోయిన LSG ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆయన ఈ పోస్ట్ పెట్టారు. రిషభ్ పంత్ మీద ఆత్మీయంగా చేతులు వేసి మాట్లాడుతున్న ఈ ఫోటో ద్వారా ఆయన తన టీమ్ కు ఓ రిక్వెస్ట్ చేశారు. ఈ సీజన్ లో సెకండాఫ్ మనం అనుకున్నట్లుగా సాగలేదు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది గర్వపడాల్సింది చాలా ఉంది అని చెప్పారు. చాలా కష్టం పడ్డాం అని మంచి ఫలితాలు కూడా సాధించాం అని...ఇక మిగిలిన రెండు గేమ్స్ ను కూడా చాలా పవర్ ఫుల్ గా ఫినిష్ చేసి గర్వంగా సీజన్ ను ముగిద్దాం అని చెప్పారు. రిషభ్ పంత్ లాంటి ఆటగాడికి 27కోట్ల రూపాయలు పెట్టి కొన్న తర్వాత దారుణంగా ఫెయిల్ అయ్యి కనీసం పంత్ 125పరుగులు కూడా చేయలేకపోయిన సీజన్ లో ఇటు ఆటగాడిగానే కాకుండా అటు కెప్టెన్ గానూ విఫలమై మంచి టీమ్ ఉన్నా ఎలిమినేట్ అయిపోయిన చోట ఓనర్ సంజీవ్ గోయెంకా ఇచ్చిన ప్రోత్సాహం కచ్చితంగా ఆటగాళ్లకు మనోధైర్యాన్ని ఇచ్చి ఉంటుంది. లేదంటే ఈ సీజన్ లో ఇప్పటికీ టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ కి రెండోసారి షాక్ ఇచ్చింది LSG. ఏప్రిల్ 12న గుజరాత్ పై 6వికెట్ల తేడాతో గెలిచిన లక్నో మళ్లీ నెల రోజుల తర్వాత నిన్న 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో మిచ్ మార్ష్ భారీ సెంచరీ, పూరన్ అర్థ సెంచరీతో 235 పరుగులు చేసి..ఆ తర్వాత గుజరాత్ ను టార్గెట్ ఛేజ్ చేయనీకుండా అడ్డుకుంది. సీజన్ లో మొదటి మ్యాచ్ ఆడిన LSG బౌలర్ విలియం ఓ రూర్కీ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 27పరుగులు మాత్రమే 3 వికెట్లు తీసి అదరగొడితే బడోనీ, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీసి ఓ రూర్కీకి సహకరించటంతో గుజరాత్ 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. షారూఖ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీ బాదినా గుజరాత్ ను గెలిపించ లేకపోయాడు. మొత్తంగా అలా ఓనర్ బ్యాకింగ్ పని చేసి LSG ఈ సీజన్ లో రెండోసారి గుజరాత్ టైటాన్స్ పై రెచ్చిపోయి..ఈ సీజన్ లో గుజరాత్ ను రెండుసార్లు ఓడించిన ఏకైక టీమ్ గా నిలిచిందన్నమాట.





















