GT vs CSK Match Highlights IPL 2025 | ఆఖరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ పై పరుగుల తేడాతో CSK విక్టరీ | ABP Desam
మూడు రోజులుగా కొనసాగుతున్న ట్రెండ్ ను నాలుగో రోజు ధోనీ కొనసాగించాడు. ప్లే ఆఫ్స్ కి సెలెక్ట్ అయి టాప్ 2 ప్లేస్ కోసం ట్రై చేస్తున్న బడా టీమ్ గుజరాత్ టైటాన్స్ కు షాకిచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ ను 83పరుగుల తేడాతో గెలుచుకుంది ధోనీ సేన. గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై ఓపెనర్ల జోరుతో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఆయుష్ మాత్రమే 17 బాల్స్ లోనే మూడు ఫోర్లు మూడు సిక్సర్లతో 34పరుగులు చేయగా...మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 35 బాల్స్ లో 6ఫోర్లు 2 సిక్సర్లతో 52పరుగులు చేశాడు. ఉర్విల్ పటేల్ 19 బంతుల్లో 37పరుగులు రెచ్చిపోతే...మిడిల్ ఆర్డర్ లో వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ AB డివిలియర్స్ ఆటతీరుతో అదరగొట్టాడు. 23 బాల్స్ లో 4ఫోర్లు 5 సిక్సర్లతో బ్రేవిస్ 57పరుగులు చేయటంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో అత్యధికంగా 230పరుగులు చేసింది.ప్రసిద్ధ్ మాత్రమే 2వికెట్లతో ఆకట్టుుకున్నాడు. 231 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ తడబడుతూనే ఆడింది. సాయి సుదర్శన్ 41పరుగులు చేయటం మినహా మరే బ్యాటర్ కూడా 20 పరుగులు దాటలేకపోయాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంభోజ్ 13పరుగులే ఇచ్చి 3వికెట్లు తీస్తే...నూర్ అహ్మద్ 21పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జడ్డూ 2 వికెట్లు పడగొట్టడంతో గుజరాత్ 147పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా సీజన్ ను విక్టరీ తో చెన్నై ఆఖరి స్థానంలోనే ఉండి ముగించగా..గుజరాత్ మాత్రం టాప్ 2 ప్లేస్ కోసం మిగిలిన జట్ల పరిస్థితుల మీద ఆధారపడాల్సి వచ్చింది.





















