DC vs KKR Match Highlights IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్ పై 14పరుగుల తేడాతో కేకేఆర్ విజయం | ABP Desam
వరుస ఓటముల్లో ఉన్న కేకేఆరే కదా ఢిల్లీ ఈజీగా ఓడించేస్తుంది అనుకుంటే రివర్స్ అయ్యింది. కేకేఆర్ ఢిల్లీని 14పరుగుల తేడాతో ఓడించింది. ట్విస్టులు, టర్నులు ఏం లేకుండా చివర్లో విజయం కేకేఆర్ నే వరించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. స్టేబుల్ టాప్ ఆర్డర్
జనరల్ గా ఏ మ్యాచ్ అయినా ఎవరో ఒకరు ఆడతారు మరొకరు సపోర్టింగ్ రోల్ లో ఉంటారు. కానీ టాస్ ఓడి ఢిల్లీ చెప్పినట్లు బ్యాటింగ్ కి దిగిన కేకేఆర్ మాత్రం డిఫరెంట్ గా ఆడింది. ఒక్క వెంకటేశ్ అయ్యర్ మినహాయిస్తే టాప్, మిడిల్ ఆర్డర్ మొత్తం ఒకేలా ఆడారు. ఎవ్వరూ భారీ స్కోరు చేయలేదు. అలా అని ఎవ్వరూ తక్కువా ఆడలేదు. గుర్భాజ్ 26, నరైన్ 27, అజింక్యా రహానే 26 పరుగులు చేసి ఔట్ అయ్యారు. గుర్భాజ్ ను స్టార్క్ అవుట్ చేస్తే..నరైన్ ను విప్రాజ్ నిగమ్ అవుట్ చేశాడు. ఇక కేకేఆర్ కెప్టెన్ రహానే వికెట్ ను అక్షర్ పటేల్ LBW చేశాడు. ఫలితంగా 7 ఓవర్లలోనే 91 పరుగులు చేసిన కేకేఆర్ 3 వికెట్లు నష్టపోయింది.
2. టుడే రఘువంశీ షో
నిన్ననే 14ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆట చూశాం..అచ్చం అలాంటి ఇన్నింగ్సే ఆడేలా కనిపించాడు కేకేఆర్ టీనేజ్ బ్యాటర్ ఆంగ్ క్రిష్ రఘవంశీ. 32 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 44 పరుగులు చేసిన రఘువంశీ తృటిలో వికెట్ ను కోల్పోవటంతో ఢిల్లీ మళ్లీ కష్టాల్లో పడింది.
3. అక్షర్, విప్రాజ్ కట్టడి
వాస్తవానికి కేకేఆర్ బ్యాటింగ్ తీరు చూస్తే వాళ్లింకా ఎక్కువే స్కోరు చేయాల్సింది. కానీ వాళ్లను సమర్థంగా ఢిల్లీ స్పిన్నర్లు అక్షర్ పటేల్.. విప్రాజ్ నిగమ్. అక్షర్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 27పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇంజ్యూరీ హ్యాండ్ తోనే ఆడిన కెప్టెన్ రహానేను, వెంకటేశ్ అయ్యర్ ను అవుట్ చేశాడు ఇటేపు కెప్టెన్ అక్షర్ పటేల్. విప్రాజ్ నిగమ్ పరుగుల విషయంలో అక్షర్ అంత పిసినారి కాకపోయినా 4ఓవర్లలో 41రన్స్ ఇచ్చినా రెండు వికెట్లు తీశాడు. ప్రమాదకరమైన నరైన్ ను అవుట్ చేయటంతో పాటు రింకూ సింగ్ ఇంకా భారీ స్కోరుకు వెళ్లకుండా ఆపేశాడు. ఫలితంగా కేకేఆర్ 204పరుగులు చేసి..205 టార్గెట్ ఇవ్వగలిగింది.
4. క్లాసీ డుప్లెసీ.. డ్యాషింగ్ అక్షర్
205పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీకి కావాల్సినంత మంచి ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ 4పరుగులు ఉన్నప్పుడు పోరల్, 40ల్లోకి వచ్చేసరికి కరుణ్ నాయర్, పవర్ ప్లే ముగిసిన మూడు బాల్స్ పడేసరికి కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయారు. ఓవైపు ఫాఫ్ డుప్లెసీ తన క్లాస్ చూపిస్తున్నా నిలబడేందుకు మరో బ్యాటర్ లేకుండా పోయాడు. ఆఖరకు ఫిఫ్త్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ మాత్రమే కాస్త స్టాండర్డ్ ఇచ్చాడు. ఫాప్ కి రెస్ట్ కల్పిస్తూ తను బౌండరీలతో రెచ్చిపోయాడు. 23 బాల్స్ లోనే 4 ఫోర్లు 3 సిక్సర్లతో 43 పరుగులు చేసిన అక్షర్ అవుట్ అవటంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అక్షఱ్ తర్వాత స్టబ్స్, ఫాఫ్ డుప్లెసీ అయిపోవటంతో ఆల్మోస్ట్ మ్యాచ్ పై ఆశలు కోల్పోయింది. ఫాఫ్ డుప్లెసీ 45 బాల్స్ లో 7ఫోర్లు 2 సిక్సర్లతో 62పరుగులు చేసి అవుటయ్యాడు డుప్లెసిస్.
5. మ్యాచ్ తిప్పేసిన నరైన్, వరుణ్
ఢిల్లీకి ఎలా అయితే విప్రాజ్, అక్షర్ వికెట్లు తీసి పెట్టారో అలా కేకేఆర్ కు నరైన్ మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. అసలు ఫస్ట్ రెండు ఓవర్లు ఏ ప్రభావం చూపించని నరైన్ ఉన్నట్లుండి వరసగా వికెట్లు తీసేసి మ్యాచ్ ను కేకేఆర్ చేతుల్లోకి తెచ్చేశాడు. కేఎల్ రాహుల్ ను రనౌట్ చేసిన నరైన్..ఫాప్ డుప్లెసీని, అక్షర్ పటేల్ ను అవుట్ చేయటంతో పాటు స్టబ్స్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లలో 29పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు నరైన్. మరో వైపు వరుణ్ చక్రవర్తి కూడా తన రోల్ ను బాగా ఇంప్లిమెంట్ చేశాడు. 4 ఓవర్లలో 39 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివర్లో ఢిల్లీ ఆల్ రౌండర్ విప్రాజ్ నిగమ్ 38 పరుగులతో పోరాడినా రస్సెల్ తనను ఔట్ చేయటం ద్వారా ఢిల్లీని 190పరుగులకే పరిమితం చేసి కేకేఆర్ ను 14పరుగుల తేడాతో గెలిపించాడు.
ఈ విజయంతో ద్వారా కేకేఆర్ పాయింట్స్ టేబుల్ లో 7వ స్థానానికి ఎగబాకితే...మ్యాచ్ ఓడినా ఢిల్లీ నాలుగో స్థానంలోనే ఉంది.





















