Akash Maharaj Singh Tributes Digvesh rathi | బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేసి దిగ్వేష్ కి ట్రిబ్యూట్ ఇచ్చిన ఆకాశ్
మనిషిలో పొగరున్నా ఆటలో నిజాయితీ ఉంటే చెల్లిపోతుంది అనటానికి మరో ఎంగ్జాపుల్ గా తయారయ్యాడు దిగ్వేష్ రాఠీ. ఈ ఐపీఎల్ సీజన్ లో LSG తరపున బౌలర్ గా అరగేట్రం చేసిన దిగ్వేష్..తనదైన యూనిక్ నోట్ బుక్ సెలబ్రేషన్స్ తో వార్తల్లో నిలిచాడు. వికెట్ తీసిన తర్వాత ఆటగాళ్లకు దగ్గరకు వెళ్లి చీటీ రాసిస్తున్నట్లు నోట్ బుక్ లో పేజీ మీద పేరు రాసి చింపేస్తున్నట్లు చేసే సెలబ్రేషన్స్ తో చాలా మంది బ్యాటర్లకు మండింది. మొన్న సన్ రైజర్స్ పై సేమ్ సెలబ్రేషన్ తో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్ అభిషేక్ శర్మకు అయితే మంటెక్కించాడు. అభిషేక్ శర్మ కూడా తగ్గేదేలే అన్నట్లు గట్టిగానే గొడవపడటంతో ఈ సారి దిగ్వేష్ రాఠీపై మీద వేటు తప్పలేదు. ఈ సీజన్ లో మూడోసారి దిగ్వేష్ పై మ్యాచ్ ఫీజులో 50శాతం ఫైన్ విధించిన రిఫరీ...డీమెరిట్ పాయింట్స్ కారణంగా ఓ మ్యాచ్ నిషేధం కూడా విధించారు. అలా నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో దిగ్వేష్ ఆడలేదు. అతనికి బదులుగా ఆకాశ్ మహరాజ్ సింగ్ అనే కుర్ర బౌలర్ బౌలింగ్ చేసి బాగానే ఆకట్టుకున్నాడు. 3ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చినా కూడా ప్రమాదకర జోస్ బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేసి లక్నో విసిరిన 236పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయకుండా గుజరాత్ ను అడ్డుకోవటంలో ఆకాశ్ మహరాజ్ సింగ్ సక్సెస్ అయ్యాడు. 18 బాల్స్ లోనే 3 ఫోర్లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేసిన జోస్ బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత ఆకాశ్ చేసిన సెలబ్రేషన్ ఏంటో తెలుసా చీటీ రాసి దిగ్వేష్ కి ట్రిబ్యూట్ ఇవ్వటం. ఈ సీజన్ లో 14 వికెట్లతో తొలిసీజన్ లో నే వికెట్ల పరంగా మంచిగానే పర్ఫార్మ్ చేసిన దిగ్వేష్ రాఠీ కేవలం తన సెలబ్రేషన్ కారణంగా ఫైన్స్ కి గురి అవటం..మ్యాచ్ నిషేధం పడటం లాంటివి ఆకాశ్ కి అంతగా నచ్చినట్లు లేవు. ఆ చేష్టల కారణంగానే తనకు వచ్చిన అవకాశాన్ని తనకు ఆ అవకాశం కల్పించిన దిగ్వేష్ కి ట్రిబ్యూట్ ఇస్తూ బట్లర్ వికెట్ తీసి దిగ్వేష్ లానే నోట్ బుక్ సెలబ్రేట్ చేయటం వైరల్ గా మారింది.





















