India vs USA Highlights - భారత్, యూఎస్ఏ వరల్డ్ కప్ మ్యాచ్ హైలెట్స్
టీ20 ప్రపంచకప్‌లో భారత్ అడుగు ముందుకేసింది. యూఎస్‌ఏపై విజయంతో సూపర్-8లోకి అడుగుపెట్టింది. దీంతో గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 18.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాప్-5 హైలెట్స్ ఏవో చూద్దాం.
ఈ మ్యాచ్‌లో భారత పేస్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 వరల్డ్ కప్‌ల్లో భారత్ తరఫున బెస్ట్ బౌలింగ్ ఫిగర్ నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి యూఎస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
2. హార్దిక్ పాండ్యా అదుర్స్
ఈ వరల్డ్ కప్‌లో భారత్ తరఫున హయ్యస్ట్ వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరో తెలుసా? బూమ్ బూమ్ బుమ్రానో, అర్ష్‌దీప్ సింగ్‌నో కాదు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనే హార్దిక్ ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు. అందులో డేంజరస్ ఆరోన్ జోన్స్ వికెట్ కూడా ఉంది.
3. ఘోరంగా విఫలమైన ఓపెనర్లు
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అయ్యారు. విరాట్ కోహ్లీ తాను ఆడిన మొదటి బంతికే డకౌట్ కాగా, రోహిత్ శర్మ మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. వీరిద్దరినీ భారత్ నుంచి వెళ్లి కెనడాలో సెటిల్ అయిన సౌరభ్ నెట్రావల్కర్ అవుట్ చేశాడు.