Ind vs Pak ODI Women's WC 2025 | పాకిస్తాన్‌పై భారత్ సూపర్ విక్టరీ
ఇండియా అమ్మాయిలు ఇరగదీశారు. అబ్బాయిలకి మేమేం తగ్గేది లేదంటూ.. పాకిస్తాన్ టీమ్‌ని చిత్తు చేశారు. ప్రపంచకప్‌లతో పాటు మొత్తం వన్డేల్లో పాకిస్తాన్‌పై వరుసగా 12వ విక్టరీని నమోదు చేశారు. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని ఏకంగా 88 రన్స్ తేడాతో ఓడించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా.. హర్లీన్ డియోల్ 46 రన్స్‌తో రెస్పాన్సిబుల్ నాక్‌కి తోడు..చివర్లో రిచా ఘోష్ పించ్ హిట్టింగ్ దెబ్బకి 50 ఓవర్లలో 247 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఇక 248 రన్స్ టార్గెట్‌తో ఛేజింగ్‌కి దిగిన పాకిస్తాన్ ఏ ఒక్క స్టేజ్‌లోనూ గెలిచేలా కనిపించలేదు. కనీసం పరువు నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆడినట్లు ఆడింది. అయితే సిద్రా ఆమిన్.. 81 ఒంటరి పోరాటం చేసి.. టీమ్ స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లింది. అయితే 40వ ఓవర్లో రాణా బౌలింగ్‌లో అమిన్ అవుట్ కావడంతో పాక్ చాప చుట్టేసింది. 8వ వికెట్‌గా అమిన్ అవుటైతే.. మిగిలిన ఇద్దరు బ్యాటర్లు 9 పరుగుల తేడాతో అవుటైపోయారు. దీంతో 43 ఓవర్లలో 159 పరుగులకి పాక్ ఆలౌట్ కాగా.. భారత్‌కి 88 పరుగుల భారీ విజయం దక్కింది. టీమిండియా బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు తీస్తే.. స్నేహ్ రాణా 2 వికెట్లతో అదరగొట్టింది. ఈ విజయంతో టీమిండియా వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెక్ట్స్ 9వ తేదీన సౌత్‌ఆఫ్రికా వుమెన్స్‌తో తలపడబోతోంది.





















