Gautam Gambhir on Kohli Rohit Sharma | రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ పేరు ప్రకటన కాగానే అందరిలోనూ ఒకటే టెన్షన్. సీనియర్లను కోచ్ ఏం చేస్తాడో అని. ఎందుకంటే గంభీర్ తత్వం ఎప్పుడూ ఒకటే. వ్యక్తుల కంటే జట్టు ప్రయోజనాలు ముఖ్యం అని బలంగా నమ్మే వ్యక్తి. అందుకే విజయంలో ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వటం..లేదు ఆట కంటే మనుషులు ప్రత్యేకం అన్నట్లు మాట్లాడటం గంభీర్ కు అస్సలు నచ్చదు. మరి అలాంటి గంభీర్ ను టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా నియమించినప్పుడు చాలా మందిలో ఒకటే డౌట్. క్రికెట్ ను మించి సూపర్ స్టార్లు గా ఎదిగిన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ భవిష్యత్తు ఏంటీ అని. ప్రస్తుతం టీమిండియాలో ఈ ఇద్దరి ఆటగాళ్ల ఫ్యాన్ బేస్ మీద టీమిండియా క్రికెట్ అంతా తిరుగుతోంది. అందుకే ఈ ఇద్దరు ఆటగాళ్లను వాళ్ల అభిమానులు ఆట కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఫ్యూచర్ కోసం టీ20 లకు కొహ్లీ అండ్ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించారు. మరి వన్డేలు, టెస్టుల్లో ఎన్నాళ్లు వీళ్లిద్దరూ ఆడొచ్చనే డౌట్ మొదలైంది. బట్ ఈ అనుమానాలన్నీ పటా పంచలు చేసేలా గౌతం గంభీర్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. శ్రీలంకతో టూర్ కి ముందు నేషనల్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన గౌతీ...విరాట్ కొహ్లీ ఇంకా రోహిత్ శర్మలో చాలా క్రికెట్ మిగిలి ఉందన్నాడు. వాళ్లు టీ20లకే రిటైర్మెంట్ ఇచ్చారని..వన్డేలు, టెస్టులకు వీలైనంత అందుబాటులో ఉంటారని భావిస్తున్నానన్నాడు. అంతే కాదు ఈ ఇద్దరూ కలిసి ఆడటం చాలా ఇంపార్టెంట్ అన్న గంభీర్...2027 వన్డే వరల్డ్ కప్ లో కొహ్లీ, రోహిత్ శర్మ ఆడాలని తను కోరుకుంటున్నానన్నాడు. అంటే మరో మూడేళ్ల పాటు కొహ్లీ, రోహిత్ శర్మ కెరీర్ కి నో బ్రేక్ అన్నమాట..ఇద్దరూ కలిసి ఇంకో వరల్డ్ కప్ ఆడతారు గెలిపిస్తారు అని ఫ్యాన్స్ అయితే గంభీర్ స్టేట్మెంట్ తో పండుగ చేసుకుంటున్నారు.