Shreyas Iyer Asia Cup 2025 | శ్రేయస్ అయ్యర్ సెలక్ట్ కాకపోవటం వెనుక భారీ కుట్ర ఉందా.? | ABP Desam
టీ20 టీంలో అయ్యర్‌కి చోటు లేదు.. ఇది నిన్న ఆసియా కప్ కోసం టీమ్ ఎనౌన్స్ చేసిన తర్వాత టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన కామెంట్స్ ఇవి. కానీ టీమ్‌లో ఫామ్‌లో లేని ఆటగాళ్లకి, రీసెంట్ సిరీస్‌ల్లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయని ఆటగాళ్లకి చోటు లేదంటే ఓకే. బట్.. అయ్యర్ అలా కాదు. టీమిండియాలో అతను వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్. రెండు, మూడేళ్ల నుంచి వన్డేల్లో టీమిండియాకి అయ్యర్ ఓ పెట్టని గోడలా నిలబడ్డాడు. 2023 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్ వరకు చేరుకుందంటే అందులో రోహిత్ శర్మ తర్వాత అయ్యర్‌దే మోస్ట్ కాంట్రిబ్యూషన్. టోర్నీ మొత్తం నాలుగో ప్లేస్‌లో బ్యాటింగ్ చేస్తూ 530 రన్స్‌తో వరల్డ్ రికార్డ్ సాధించాడు. రీసెంట్‌గా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా 243 రన్స్‌తో టోర్నీలోనే సెకండ్ టాప్ స్కోరర్‌గా.. టీమిండియా తరపున టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలబడటమే కాకుండా టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీ రోల్ పోషించాడు. సరే.. ఇవన్నీ వన్డేలు.. ఇప్పుడు జరుగుతుంది టీ20లు కాబట్టి.. అయ్యర్ ఈ ఫార్మాట్‌కి సరిపోడంటారా..? బట్.. 2024 ఐపీఎల్‌లో కేకేఆర్ టీంని కెప్టెన్‌గా లీడ్ చేయడమే కాకుండా.. 146 'స్ట్రైక్ రేట్‌తో 351 రన్స్ చేసి.. 13 ఏళ్ల తర్వాత ఆ టీమ్‌కి కప్ అందించాడు. ఇక రీసెంట్‌గా 2025 ఐపీఎల్‌లో అయితే అసలు టాప్ 4లో ఉండటమే మర్చిపోయిన పంజాబ్ టీమ్‌ని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. ఈ టోర్నీలో 17 మ్యాచ్‌లు ఆడి 6 హాఫ్ సెంచరీలతో 604 రన్స్ చేశాడు. ఇంతకు మించి ఓ టీ20 ప్లేయర్‌కి ఇంకేం కావాలి? జస్ట్ బ్యాటర్‌గా మాత్రమే కాకుండా.. కెప్టెన్సీలోనూ టాప్‌లో ఉంటాడు అయ్యర్. అయినా అతడ్ని సెలక్ట్ చేయకపోవడమే ఇప్పుడు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌కి కోపం తెప్పిస్తోంది. దానికి తోడు అగార్కర్ ఇచ్చిన వేగ్ రెస్పాన్స్ కూడా ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అయ్యర్‌ని అసలు ఎందుకిలా టార్గెట్ చేసి దెబ్బతీస్తున్నారని ప్రశ్నిస్తున్నారు చాలామంది ఫ్యాన్స్. 2023 వన్డే వరల్డ్ కప్‌లో సూపర్ పెర్షార్మెన్స్ చేసినా.. డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదనే సాకుతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేశారు. తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడి.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 345 రన్స్ చేశాడు. ఇక ఐపీఎల్‌లో కేకేఆర్‌కి కప్ అందించినా.. అతడ్ని టీమ్‌లో నుంచి తీసేశారు. రీసెంట్‌గా ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టి.. ఐపీఎల్లో పంజాబ్ లాంటి టీమ్‌ని ఫైనల్‌కి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు తననితాను ప్రూవ్ చేసుకుంటున్నా కూడా.. కావాలని, టార్గెట్ చేసి అయ్యర్ కెరీర్‌ని నాశనం చేస్తున్నారు. అసలు బీసీసీఐ ఎందుకిలా అయ్యర్‌పైన కక్ష కట్టినట్లు బిహేవ్ చేస్తోంది? అని సీరియస్‌గా క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇక కొంతమందైతే ఏకంగా.. దీనంతటికీ కారణం టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీరే అని కూడా అంటున్నారు. 2024లో కేకేఆర్ మెంటార్‌గా ఉన్న గంభీర్‌కి, అయ్యర్‌కి పడకపోవడం వల్లే.. ట్రోఫీ గెలిపించినా కూడా అతడ్ని టీం వదులుకుందని.. ఇక ఇప్పుడు కూడా టీమిండియా కోచ్‌గా ఉన్న గంభీర్ వద్దనడం వల్లే అయ్యర్‌ని టీమిండియాకి సెలక్ట్ చేయలేదని అంటున్నారు. వీళ్లలోనే కొంతమంది ఈ మొత్తం ఇష్యూకి పొలిటికల్ రంగు పులమడానికి కూడా ట్రై చేస్తున్నారు. 2023 వరల్డ్ కప్ టైంలో ఫైనల్లో ఓడిన టీమిండియాని ప్రధాని మోడీ కలిసినప్పటి వీడియోలని షేర్ చేస్తూ.. అందులో ప్రధానిని చూడగానే అయ్యర్ ముఖం తిప్పుకున్నాడని.. బీజేపీ అంటే అయ్యర్‌కి ఇష్టం లేదు కాబట్టి.. బీజేపీ తరపున ఎంపీగా పనిచేసిన గంభీర్ కావాలనే అయ్యర్‌ని సైడ్‌లైన్ చేస్తున్నాడని అంటున్నారు.





















