Rishabh Pant Funny Banter Bangladesh | Ind vs Ban టెస్టులో బంగ్లా పులులకు పంత్ ట్రోలింగ్ తాకిడి |ABP
రిషభ్ పంత్ గురించి తెలుసుగా. ఫామ్ లో ఉన్నాడా ఆ నోటికి తాళం వేయలేం. ప్రత్యర్థి ఎవరనేది చూడడు. ఆస్ట్రేలియాలోనే గబ్బాలో ఓ ఆటాడుకున్నోడికి బంగ్లా దేశ్ ని చెన్నైలో వాయించటం ఓ లెక్కా. సెంచరీ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టడటమే కాదు మాటలతోనూ బంగ్లా పులులకు చిరాకు తెప్పించాడు. ఘోరమైన యాక్సిడెంట్ కారణంగా రెండేళ్లు క్రికెట్ దూరమైనా తన క్రికెట్ లవర్, ఎంటర్ టైనర్ ఏమాత్రం తగ్గలేదు అన్నట్లుగా బంగ్లాదేశ్ కే ఫీల్డింగ్ సెట్ చేశాడు మనోడు. తనను ఎలాగో ఔట్ చేయలేకోపోతున్నారులే అనుకున్నాడు ఏమో ఆ మిడాన్ ఆన్ లో ఒకడిని పెట్టొచ్చుగా అంటూ బంగ్లా కెప్టెన్ షంటో కే సలహాలు ఇచ్చాడు. మధ్యలో మధ్యలో మాటల యుద్ధానికి దిగుతూ బంగ్లాను సైకలాజికల్ గానూ చావు దెబ్బతీశాడు. స్టంప్ మైక్ లో రికార్డైన పంత్ ఫన్నీ బాంటర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇలాంటివన్నీ పంత్ కి మూములేగా అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.