India vs Bangladesh T20 Match Result | టీ 20 మ్యాచ్‌లో బంగ్లాపై భారత్ విజయం | ABP Desam
మొన్నీమధ్యే బంగ్లాదేశ్‌లో టెస్ట్ సిరీస్ ఆడింది ఇండియా. ఆ సిరీస్‌ని 2-0 తో స్వీప్ చేసింది. ఆ వెంటనే T20 సిరీస్ మొదలైంది. ఇక్కడా అదిరిపోయేలా ఆరంభించింది. మెయిన్ ప్లేయర్స్ లేరన్న లోటుని తీరుస్తూ భారత్ బోణీ కొట్టింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, మయాంక్ యాదవ్ ఓ వికెట్ తీసి బంగ్లాదేశ్‌ని పూర్తిగా కట్టడి చేశారు. ఫలితంగా..బంగ్లా టీమ్ 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరవాత క్రీజ్‌లోకి దిగిన ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ కేవలం 11.5 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు, సంజు శాంసన్ 29 పరుగులు చేయగా..హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మూడు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్‌కి ప్లేయర ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ తరవాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేరు బాగా వినబడుతోంది. దాదాపు మూడేళ్ల విరామం తరవాత ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు వరుణ్. ఈ తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఇది నాకు రీబర్త్‌డే అంటూ ఎమోనల్ అయ్యాడు.