IND vs PAK WCL Semi-Final | పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేది లేదు | ABP Desam
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌తో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్‌ను ఆడమంటూ టీం ఇండియా ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెపుకోవచ్చు.
యువరాజ్ సింగ్ నాయకత్వంలో శిఖర్ ధవన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, పీయూష్ చావ్లా వంటి దిగ్గజ క్రికెటర్లతో టీమిండియా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంది. ఈ టోర్నమెంట్‌లో గ్రూప్ స్టేజ్‌లోనూ భారత జట్టు పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించింది.
డబ్ల్యూసీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది. "డబ్ల్యూసీఎల్ లో మేము మార్పులను తీసుకురాగలవని అనుకుంటున్నాము. ప్రజల సెంటిమెంట్ ను కూడా గౌరవించాలి. భారత జట్టు సెమీఫైనల్ నుంచి ఉపసంహరించుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము. ఈ పరిస్థితుల దృష్ట్యా, భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ రద్దు చేయబడింది. ఫలితంగా, పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది" అని డబ్ల్యూసీఎల్ తెలిపింది.





















