Asia Cup 2025 Team India | ఆసియా కప్ కు టీమిండియా ఎంపిక..ఆ ప్లేయర్లను తొక్కేశారా.? | ABP Desam
ఆసియా కప్ 2025 కోసం BCCI ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టుపై క్రికెట్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ జట్టు కంప్లీట్ గా KKR జట్టులా ఉందని, అద్భుతమైన ఆటతో IPL, champions trophyల్లో ఇరగదీసిన అయ్యర్ ని పక్కన పెట్టడం ఏంటని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. టీం కోచ్ గా ఉన్న గంభీర్ కావాలనే అయ్యర్ ని తొక్కేస్తున్నాడని కొంతమంది కోప్పడుతున్నారు. అయ్యర్ ని సెలెక్ట్ చేయకపోవడాన్ని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా తప్పుబట్టాడు. అయితే అయ్యర్ ని సెలెక్ట్ చేయకపోవడంపై సెలెక్టర్ అగర్కర్ మాట్లాడుతూ.. పరిస్థితుల వల్లే అతన్ని సెలెక్ట్ చేయలేదని, ఇందులో అతడి తప్పు లేదు.. అలాగని మా తప్పు లేదు అని చెప్పాడు. అయితే Agarkar కామెంట్స్ తో ఫ్యాన్స్ కన్విన్స్ అయినట్లు కనిపించడంలేదు. శివమ్ దూబె కంటే అయ్యర్ పనికిరాకుండా పోయాడా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఇంకొంతమంది అయ్యర్ తో పాటు.. వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ లని కూడా సెలెక్ట్ చేయాల్సిందంటున్నారు. ఇక సెలక్ట్ అయిన టీం members details చూస్తే.. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా Subhman గిల్, వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేశ్ శర్మ సెలక్ట్ అయ్యారు. వాళ్ళతో పాటు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దుబే, అక్షర్ పటేల్, jasprit bumrah, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, Kuldeep Yadav, Harshit Rana, Rinku Singh టీంలో ప్లేస్ సంపాదించుకున్నారు. వీళ్లలో sky, Rinku, Harshit Rana, Varun చక్రవర్తి నలుగురు KKR కి ఆడిన వాళ్ళే కావడం వల్లే ఇది KKR టీం అంటూ trolls వస్తున్నాయి. ఇదే కాకుండా ఫైనల్ 11లో సంజు ఉంటాడా? లేదా? అనే విషయం కోచ్, కెప్టెన్ చూసుకుంటారని Agarkar అనడంతో సంజు ఫ్యాన్స్ కూడా ఇప్పుడు హర్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా ఈ టీం సెలక్షన్ పై చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. But కొంతమంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ మాత్రం.. టీంతో సెలెక్ట్ కానంత మాత్రాన అన్యాయం జరిగినట్లు కాదని.. KL Rahul, Yasaswi Jaiswal లు సెలెక్ట్ కాకపోవడమే దీనికి ప్రూఫ్ అంటున్నారు. టాలెంట్ ఉన్నా.. టీం పోజిషన్స్ లో ఫిట్ కాకపోవడం వల్లే వీళ్లంతా సెలెక్ట్ కాలేదు కానీ.. వేరే రీజన్ లేదంటున్నారు. మరి ఈ టీం సెలక్షన్ పై మీ opinion ఏంటి?





















