Dark Matter Dark Energy Explained in Telugu | శాస్త్రవేత్తలకు నేటికి అంతుచిక్కని ఈ చీకటి పదార్థాలు ఏంటి.? | ABP Desam
ఈ అనంతమైన విశ్వంలో మనిషి కంటికి కనిపిస్తున్నది 5 శాతం మాత్రమే. అంటే మీరు, నేను, మన భారత దేశం, ఈ భూమి, మన సూర్యుడు, సౌర కుటుంబం, నక్షత్రాలు, గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ అన్నీ అన్నీ కలిపి ఈ విశ్వంలో కేవలం 5 శాతం మాత్రమే. మరి విశ్వంలో మిగిలిన 95శాతం ఉన్నది ఏంటీ..? అదేంటీ అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం జస్ట్ ఓ ప్రాథమిక అవగాహనే తప్ప ఒరిజినల్ గా 95శాతం మన విశ్వాన్ని ఆక్రమించిన మే బీ నడిపిస్తున్న ఆ పదార్థం ఏంటీ.. దాని మనుగడకు కారణాలు ఏంటి అనే విషయాలు ఇప్పటికీ మన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తెలుసుకుంటూనే ఉన్నారు. సరిగ్గా ఈ విశ్వం ఎవరో ఒకరు సృష్టించింది..మన పరిజ్ఞానానికి అర్థం కాని ఆ 95శాతం పదార్థం దేవుడు అనే ఓ ఊహ ఓ కల్పన క్రియేటిజానికి దోహదపడుతూ దేవుడు అనే ఇదంతా భగవత్ సృష్టి అనే కన్ క్లూజన్ కు కారణమవుతోంది. నిజంగా ఆ 95శాతం పదార్థం అసలు ఏంటీ..మన సైంటిస్టుల దగ్గరున్న ఆ ప్రాథమిక అవగాహన ఏంటీ..ఈ వారం అంతరిక్ష కథల్లో చూద్దాం.





















