BIG BANG Explained in Telugu | బిగ్ బ్యాంగ్ తో మొదలైన విశ్వం పుట్టుక వెనుక ఇంత కథ ఉందా.? | ABP Desam
మన భూమి, సౌర కుటుంబం, కోట్లాది గెలాక్సీలు..అంతుచిక్కనంత దూరం...అసలు ఇంత పెద్ద విశ్వం ఎలా ఏర్పడింది. ఈ విశ్వం ఏర్పడటానికి కారణాలు ఏంటీ..ఈ ప్రశ్నలే కొన్ని వేల సంవత్సరాల పాటు తత్వవేత్తలను, సైంటిస్టులను నిద్రపోనివ్వకుండా చేసింది. మొదట్లో భూమి చుట్టే ఈ ప్రపంచమంతా తిరుగుతుందనే ఊహతో మొదలైన మనందరి ప్రయాణం..ఇప్పుడు లైట్ ఇయర్స్ లెక్కగట్టి ఓ గెలాక్సీ నుంచి మరో గెలాక్సీ ఎంత దూరం ఉంది...మన భూమి వయస్సు ఎంత..విశ్వం ఎప్పుడు ఏర్పడింది...లాంటి అంచనాలను వేసేంత వరకూ ఎదిగింది. ఇంతకీ సైంటిస్టులు తెలుసుకున్నది ఏంటీ..ఈ విశ్వం ఏర్పాటుకు కారణాలేంటీ అనే అని ప్రశ్నలూ వచ్చి ఆగిపోయేది ఓ మాట దగ్గరే అదే బిగ్ బ్యాంగ్. ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానమిచ్చే ఈ బ్యాంగ్ అంటే ఏంటీ..గాడ్ పార్టికల్ అని సైంటిస్టులు పిలుచుకునే ఆ పార్టికల్ ఏంటీ..అసలు ఈ విశ్వం ఏర్పడటానికి కారణాలేంటీ..ఈ వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం.
బిగ్ బ్యాంగ్ టాపిక్ దగ్గర తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు రెండు వర్గాలుగా విడిపోతారు. తత్వవేత్తలు క్రియేటిజంను అంగీకరిస్తూ ఈ విశ్వమంతా సృష్టి అని భావిస్తారు. ఎవరో ఒకరు ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించారు అనుకుంటే ఆయనే దేవుడు అనుకుంటే..అసలు ఈ గోల అంతా ఉండదు. కానీ సైన్స్ అక్కడితో ఆగిపోదు. అందుకే చాలా వరకూ సైంటిస్టులు క్రియేటిజం కంటే కూడా ఈ విశ్వం ఏర్పడటం అనేది ఓ నేచురల్ ఫినామినా అంటే సహజ సిద్ధంగా ఏర్పడింది అని భావిస్తారు. ఈ సహజ సిద్ధంగా ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలంటే మనం 13.8 బిలియన్ ఇయర్స్ కాలంలో వెనక్కి ట్రావెల్ చేయాలి.





















