Wife Kills Husband by Giving Poison | భర్తను విషమిచ్చి చంపిన భార్య
వర్ధన్నపేట భవానికుంట తండాలో దారుణం జరిగింది. భర్త నిత్యం తాగుతున్నాడని భార్య కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి ఇచ్చింది. తాగిన మైకంలో కూల్ డ్రింక్ అని నమ్మిన భర్త అది తాగి మృతి చెందాడు. భవాని కుంట తండాకు చెందిన జాటోతు బాలాజీకు భార్య కాంతి ... కూతురు, కుమారుడు ఉన్నారు. బాలాజీ వ్యవసాయం చేస్తుండేవాడు. అలాగే దినసరి కూలిగా కూడా పని చేస్తుండేవాడు. కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు బాలాజీ.
ఈ నెల 8వ తేదీన తండాలో దాటుడు పండుగను జరుపుకున్నారు. పండుగ సందర్బంగా మద్యం తాగిన భర్త బయటకు వెళ్తున్నానాని భార్య కాంతితో చెప్పాడు. కానీ మద్యం ఇంట్లోనే ఉందని కాంతి చెపింది. వంటగదిలోకి వెళ్లి కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి బాలాజీకు ఇచ్చింది.
మద్యం మత్తులో కూల్ డ్రింక్ తాగిన భర్త గొంతు నొప్పితో పడిపొయ్యాడు. భర్తను వదిలి కాంతి తండాలో వేరే వాళ్ల ఇంటికి వెళ్ళిపోయింది. బాలాజీని చూసిన స్థానికులు అతని హాస్పిటల్ కు తీసుకోని వెళ్లారు. చికిత్స పొందుతూ బాలాజీ మృతి చెందాడు. భర్త నిత్యం తాగుతున్నాడని భార్య ఇలా చేయడంపై మృతుని బంధువులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





















