Singing MLA: రాజకీయాల్లో బిజీగా ఉండే ఎమ్మెల్యే భూమన సింగర్ గా మారారు ఎందుకో...?
పౌరుషానికి ప్రతీకగా నిలిచే క్రీడ కబడ్డీ. ఈ ఆటలో...ఓ రైడర్ తన ప్రత్యర్థిని ఔట్ చేసి, తన తొడను పైకెత్తి గట్టిగా చరుస్తూ.. చూపుడు వేలిని గాల్లోకి లేపి మరీ చూపిస్తూ... నేనే సాధించానని సగర్వంగా చాటుకుంటాడు. దాన్నే ప్రో కబడ్డీలో లే...పంగా....అంటూ ట్యూన్ చేశారు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి తొమ్మిది వరకు తిరుపతి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సంకల్పించారు. నిర్వహణ బాధ్యతలతో పాటు పోటీల ప్రచార పర్వంలోనూ భూమన తనదైన ముద్ర వేస్తున్నారు. తిరుపతి కబడ్డీ పోటీలకు మరింత ప్రచారాన్ని తీసుకొచ్చే క్రమంలో ఓ సింగర్ గా కొత్త పాత్ర కూడా పోషించారు. తెగువకు తెగువకు రణ రణ సమరం...అంటూ సాగే ఓ పాటలో... లే...పంగా...కబడ్డీ కబడ్డీ కబడ్డీ...ఖేలో కబడ్డీ, ఖేలో కబడ్డీ అంటూ భూమన కరుణాకర రెడ్డి, మేయర్ శిరీషా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ అధికారి గిరీషాతో కలిసి శృతి కలిపారు భూమన.