Simran Posts Trolled: సిమ్రన్ సోషల్ మీడియా పోస్టులను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
తొంభై చివర్లో, 21వ శతాబ్దం తొలినాళ్లలో టాలీవుడ్ లో టాప్ హీరోలందరితో నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సిమ్రన్ ఇప్పుడు....తన పాత సినిమా విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అందులో భాగంగా ఒక్కమగాడు, మృగరాజు సినిమా పోస్టర్లను షేర్ చేసుకున్నారు సిమ్రన్. బాలకృష్ణతో జోడీగా నటించిన ఒక్కమగాడు విడుదలై 14 ఏళ్లు పూర్తికాగా...చిరంజీవితో జంటగా నటించిన మృగరాజు విడుదలై 21 గడిచిపోయాయి. నాటి షూటింగ్ సంగతులను, హీరోల స్క్రీన్ ప్రజెన్స్ ను పొగుడుతూ సిమ్రన్ పోస్టర్లు పోస్ట్ చేయగా...కింద కామెంట్లలో నెటిజన్లు సిమ్రన్ ను ట్రోల్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలిన సినిమాలను సూపర్ అంటూ సిమ్రన్ పొగడటంపై ఫన్నీ కామెంట్లు, మీమ్స్ తో తమదైన శైలిలో రెచ్చిపోతున్నారు మీమర్స్.





















