NASA Hubble: నాసా వెబ్ టెలిస్కోప్ చేయాల్సిన ప్రాజెక్టులేంటో డిసైడ్ చేస్తున్న హబుల్...!
మానవ నిర్మిత అతి పెద్ద టెలిస్కోప్ గా భావిస్తున్న నాసా వెబ్ తన కక్ష్యలో పని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 25న నాసా ప్రయోగించిన ఈ టెలిస్కోప్ ఇప్పటికే అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్య దిశగా పయనం ప్రారంభించింది. టెలిస్కోప్ కు ఉన్న అతిపెద్ద అద్దాలను ఇప్పటికే క్రియాశీలక స్థానంలో ఏర్పాటు చేసుకున్న టెలిస్కోప్....తర్వాత ఏం పనులు చేయాలో మరో టెలిస్కోప్ హబుల్ నిర్దేశిస్తోంది. నాసా వెబ్ ను ప్రయోగించే వరకూ అతిపెద్ద మానవ నిర్మిత టెలిస్కోప్ గా ఉన్న హబుల్...తన అనుభవాన్ని డేటా ట్రాన్స్ ఫర్ రూపంలో నాసా వెబ్ కి అందించటంతో పాటు....వెబ్ టెలిస్కోప్ తన పనిని ప్రారంభించేలా దిశానిర్దేశం చేయనుంది. ఇందులో భాగంగా తొలుత 5లక్షల గెలాక్సీల సమూహం కాస్మోస్ వెబ్ ను 200గంటల పాటు పరిశీలించే పనిని అప్పగించింది హబుల్ టెలిస్కోప్. వాస్తవానికి పరిమాణం, సామర్థ్యం ఇలా అన్ని కోణాల్లోనూ హబుల్ కంటే నాసా వెబ్ ఎన్నో రెట్లు అత్యుత్తమమైనది అయినప్పటికీ హబుల్ వారసత్వాన్ని గౌరవంగా కొనసాగిస్తామని చెబుతూ నాసా వెబ్ బృందం ట్వీట్ చేయటం ఆస్ట్రానమీ వరల్డ్ లో ఆసక్తికరంగా మారింది.