Maner River Front Works: రూ.410 కోట్ల రూపాయలతో మానేర్ రివర్ ఫ్రంట్ పనులు..రేపే శ్రీకారం
మానేర్ రివర్ ఫ్రంట్ ప్రగతి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ను మొదటి దశలో 3.75 కి.మీ వరకు, రెండో దశలో 6.25 కి.మీలు పూర్తి చేయనున్నారు. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ కన్సల్టెన్సీ మానేర్ రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే ప్రకటించారు. మానేరు రివర్ ఫ్రంట్ కు ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటేన్స్, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటేన్స్, ఆట స్థలాలు, గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. వైకుంఠ ఏకాదశి రోజున టెండర్లను పిలవనున్నారు. అనంతరం సీఎంతో శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రణాళికలు రచిస్తున్నారు. మానేర్ రివర్ ఫ్రంట్ ప్రగతి పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు.





















