Jaggayyapet SGS Aided : జగ్గయ్యపేట ఎస్‌జీఎస్ కళాశాల విద్యార్థులపై దాడి
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఎస్‌జీఎస్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. మీ అంతు తేలుస్తాం....ఫీజులు కట్టలేకపోతే మరో కళాశాలకు వెళ్లి జాయిన్ అవ్వండి అంటూ విద్యార్థుల ఆందోళను అడ్డుకున్నారు. అసలు మీరెవరంటూ ప్రశ్నించిన విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టారు. అయితే విద్యార్థులపై దాడి చేసింది స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనుచరులని ప్రతిపక్షనేతలు ఆరోపించారు. ఎయిడెడ్ పై విద్యార్థులు ఆందోళన చేస్తున్నందువల్లే...ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం కాబట్టి విద్యార్థులను ఎమ్మెల్యే అనుచరులు కొట్టారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. విద్యార్థులకు తక్షణం క్షమాపణ చెప్పాలని...వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.




















