లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతి
ఇజ్రాయేల్, హెజ్బుల్లా మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోంది. హెజ్బుల్లా దాడులను ఇజ్రాయేల్ తిప్పి కొడుతోంది. ఈ క్రమంలోనే భీకర దాడికి పాల్పడింది. లెబనాన్‌పై ఇజ్రాయేల్ చేసిన అటాక్‌లో 492 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 20 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతున్నా..ఈ స్థాయిలో దాడి జరగడం ఇప్పుడే. లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని IDF దాడులు చేస్తోంది. ఫలితంగా...వేలాది మంది తమ ఇళ్లను వదిలేసి వలస వెళ్లిపోతున్నారు. హెజ్బుల్లా స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేస్తోంది ఇజ్రాయేల్ సైన్యం. ఈ దాడులపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ యుద్ధం లెబనాన్ ప్రజలతో కాదని, అక్కడి హెజ్బుల్లాతోనే అని స్పష్టం చేశారు. ఈ యుద్ధ వాతావరణం నుంచి లెబనాన్ ప్రజలు వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు. ప్రజలని అడ్డం పెట్టుకుని హెజ్బుల్లా ఇష్టం వచ్చినట్టు ఇజ్రాయేల్‌పై దాడులు చేస్తోందని మండి పడ్డారు. తమని తాము రక్షించుకోడానికే ఈ దాడులకు పాల్పడుతున్నామని వెల్లడించారు నెతన్యాహు. లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం...ఈ దాడుల్లో మృతి చెందిన వాళ్లలో 35 మంది చిన్నారులు 58 మంది మహిళలున్నారు.