Ratan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా
మన దేశంలో ధనికులకు ఏ లోటూ లేదు. వాళ్ల ఇబ్బందులు వాళ్లుకున్నా వాటిని నెట్టుకురాగల సామర్థ్యం ఉంటుంది. అదే సమయంలో పేదలకు అండగా ప్రభుత్వాలు ఉంటాయి. వారి సంరక్షణ కోసం రకరకాల పథకాలను పెడుతూ ఉంటాయి. కానీ మధ్యతరగతి వాడే దేశంలో నిజంగా నలిగిపోయేది. జీతాలు చాలీ చాలక..ఇంటి అద్దెలు కట్టుకోలేక అటు కుటుంబాన్ని పోషించలేక నానా తిప్పలు పడుతూ ఉంటాడు. మధ్యతరగతి మనిషి పడే ఈ ఆవేదనను వీలైనంత తీర్చాలని ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా. దాని కోసం ఆయన వ్యాపారాన్నే ఓ మార్గంగా మలిచారు. టాటాల వస్తువులన్నీ వీలైనంత తక్కువ ధరల్లో అందుబాటులో ఉండేలా చేశారు.
ఈరోజు మనం చూసే వ్యాపార సంస్థలు క్రోమా లాంటి వస్తువులు అమ్మే దుకాణాలు అయినా..జూడియో లాంటి వస్త్రదుకాణాలైనా..టాటా ఇండికా లాంటి కార్లైనా..అంతెందుకు ప్రపంచంలోనే ఏ పారిశ్రామిక వేత్త ఆలోచించిన విధంగా లక్ష రూపాయలకే ప్రజలకు కారును అందించాలని చేసిన టాటా నానో కార్ల ప్రయోగమైనా టాటా ఏం చేసినా మిడిల్ క్లాస్ పీపుల్ బాగుపడాలి..మనం చేసే వ్యాపారం కేవలం వ్యాపారం మాత్రమే కాక దేశంలో ఆ సెక్షన్ పీపుల్ ఎంపవరమెంట్ కి ఉపయోగపడాలి అని ప్లాన్ చేసేవారు. అందుకే టాటా సంస్థలు విశ్వసనీయత చిరునామా గా నిలవటం తోపాటు మరే సంస్థ దక్కించుకోని మధ్యతరగతి ప్రజాదరణను పొందగలిగాయి.