PM Modi Yogi Pawan Kalyan Hindutva Speech | హిందూత్వ నినాదంతో మోదీ,యోగి బాటలో పవన్ కళ్యాణ్ | ABP
ప్రధాని మోదీకి రాజకీయ వారసుడు ఎవరు. దేశరాజకీయాలను గమనించే మ్యాగ్జిమం విశ్లేషకులు చెప్పేది ఏంటంటే యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ గోరఖ్ పూర్ పీఠాధిపతి మోదీ రిటైర్ అవ్వగానే దేశానికి సారథ్యం వహించనున్నారనే టాక్ చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అందుకోసమే ఐదుసార్లు ఎంపీగా సేవలందించిన యోగిని సీఎం చేసి పరిపాలనా వ్యహారాల్లో పదేళ్లు రాటు దేలేలా చేశారు. మరి వీరి ఐడియాలజీని దక్షిణభారతదేశంలో అమలు చేసే వ్యక్తి ఎవరు. బీజేపీ కాకపోయినా ఇందుకు సరైన వ్యక్తిగా కనిపిస్తున్నది పవన్ కళ్యాణ్. ఏపీ ఉపముఖ్యమంత్రిగా, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన పార్టీ అధినేతగా ఇటీవలి కాలంలో పవన్ వ్యాఖ్యలు చూసినవారెవరైనా దక్షిణాదిలో హిందూత్వ ముఖ చిత్రంగా పవన్ మారుతున్నారనే సంకేతాలను అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒకే అంశంపైన ఈ ముగ్గురు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. అదే డివైడ్ పాలిటిక్స్. ముందుగా యోగి ఆదిత్యనాథ్. యూపీ సీఎంగా ఉన్న యోగి ఆగస్టు 26న ఆగ్రాలో ఓ కామెంట్ చేశారు. బటేంగే తో కటేంగే. అంటే విడిపోయాం అంటే మనల్ని తొక్కేస్తారు అంతం చేస్తారు అని హెచ్చరించారు