Voyager Space Crafts Golden Record | కోట్లాది ఆశలను మోస్తూ 48ఏళ్లుగా విశ్వంలో ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్స్ | ABP Desam
మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా...మనది ఇంత పెద్ద విశ్వం కదా. మరి ఇంత పెద్ద విశ్వంలో ప్రాణులు ఉండేది కేవలం భూమిపైన మాత్రమేనేనా అని. అంటే బిగ్ బ్యాంగ్ తో మొదలైన ఈ విశ్వం విస్తరిస్తూ ఉండే ప్రోసెస్ లో ఏర్పడిన ఓ మీడియం సైజ్ నక్షత్రమైన సూర్యుడి చుట్టూ ఓ భూమి ఏర్పడి అది మనుషులు, జంతులువు, కీటకాల్లాంటి వేలకోట్ల ప్రాణులకు ఆవాసం కాగలినప్పుడు...ఇంత పెద్ద విశ్వం కదా మరెక్కడా మనలాంటి ప్రాణులు లేవా అని. వాళ్లు కూడా కాలక్రమేణా మనలా తెలివి తేటలు సంతరించుకోవటమో లేదా మనకంటే బుద్ధి జీవులుగా మనకు ఊహకు కూడా అందని టెక్నాలజీతో బతకటమో జీవిస్తుంటే మనం ఎందుకు వాళ్లని కలవకూడదు..వాళ్లతో మాట్లాడాలని ఎందుకు ప్రయత్నించకూడదు. శాస్త్రవేత్తలకు వచ్చిన ఈ ఆలోచననే వందల ఏళ్ల పాటు మేధో మథనమై చివరికి ఓ స్పేస్ క్రాప్ట్ రూపాన్ని సంతరించుకుంది. దాని పేరే వోయేజర్. 48ఏళ్ల క్రితమే నాసా ప్రయోగించిన ఈ వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ గొప్పతనం ఏంటీ..అసలు ఓ స్పేస్ క్రాఫ్ట్ 48ఏళ్లుగా ఇంకా పనిచేస్తూనే ఉండటం ఏంటీ...ఈ వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం.
నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను. మీరు ఎక్కడో ఉంటారు. మీకు నేను ఇక్కడ ఉన్నాననే విషయం ఎలా తెలుస్తుంది. అయితే నేను లెటర్ రాయటం చేయాలి..లేదా టెక్నాలజీ వాడుకుని మీకు ఫోన్లో వీడియో కాల్ చేయాలి అవునా. అలాగే భూమి మీద మనం మనుషులు అనే వాళ్లం ఉన్నాం అని...మనుషులే 800కోట్లు మంది ఉంటే ఇంకా కోతులు, ఏనుగులు, మొసళ్లు, ఎలకలు, చిన్న చీమలు ఇలా అనేక లక్షల కోట్ల ప్రాణులకు మన భూమి అనేది ఓ ఆవాసంగా ఉంటుంది అనే ఈ అనంతమైన విశ్వంలో ఎవరైనా వినే వాళ్లుంటే చెప్పాలనుకున్నారు మన శాస్త్రవేత్తలు. అందుకే ఓ స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేసి భూమి నుంచి మన సందేశంలా ఈ విశ్వంలోకి వదిలిపెట్టారు. దానికే వాయేజర్ అని పేరు పెట్టారు. అంటే అర్థం ముషాఫిర్...ప్రయాణికుడు అని. అయితే ఇక్కడే సైంటిస్టులకు ఓ డౌట్ వచ్చింది. మన దగ్గరంటే వాతావరణం ఎంత టెంపరేచర్ ఉంది..ఏంటీ అంటి అని మనకు ఓ క్లారిటీ ఉంది. కానీ కాస్మిక్ టెంపరేచర్స్ ను ఈ వాయేజర్స్ స్పేస్ క్రాఫ్ట్ మనం అనుకున్నట్లుగా తట్టుకుని నిలబడగలదా అని అందుకే..సరే ఎలాగో చేస్తున్నాం కదా ఒకటి కాదు రెండు స్పేస్ క్రాఫ్ట్ లు పంపిద్దాం అని డిసైడ్ అయ్యి..వాయేజర్ 1 అని వాయేజర్ 2 అని రెండు ఒకేలాంటి ట్విన్ స్పేస్ క్రాఫ్ట్ లను తయారు చేసిన నాసా సైంటిస్టులు...వాటిని 1977లో ప్రయోగించారు. ముందుగా వాయేజర్ 2 ని 1977 ఆగస్ట్ 20న ప్రయోగించిన నాసా...వాయేజర్ 1 ని 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించింది.
ఇలా చేయటానికి ఓ రీజన్ ఉంది. వాయేజర్ 2 కి ఎలాగో వెళ్తుంది కదా అని నాసా సైంటిస్టులు ఓ పని చెప్పారు. భూమికి అతి దూరంగా ఉన్న నాలుగు గ్రహాలైన జ్యూపిటర్, శని, యురేనస్, నెప్ట్యూన్ ల దగ్గరగా వెళ్లి వెనక్కి తిరిగి భూమిని ఫోటోలు తీయమని చెప్పి దానికి ప్రోగ్రామింగ్ చేశారు. వాయేజర్ 1 ను 15రోజుల లేట్ గా ప్రయోగించి షార్టెస్ట్ రూట్ లో ప్రయాణించేలా చేసి ఒక్క పని మాత్రమే చెప్పారు. అదే భూమిని వీలైనంత దూరం నుంచి ఫోటో తీయమని. వోయేజర్ 1 దాదాపుగా 600 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి వెనక్కి భూమిని ఫోటో తీసింది. ఎక్కడో సుదూరంగా కనిపించీ కనిపించినట్లు ఉన్న ఈ పాలిపోయిన నీలి రంగు చుక్కనే భూమి. అందుకే నాసా సైన్స్ కమ్యూనికేటర్ అయిన కార్ల్ సేగన్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ద పేల్ బ్లూ డాట్ అని పిలిచారు. నిజమే సమస్త ప్రపంచయుద్ధాలకు, దేశాల మధ్య గొడవలకు, రక్తపాతాలకు, మతాలు, కులాలు, జాతులు కొట్లాటలకు...అదే విధంగా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలకు ఇప్పుడు ఇన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఫోటోలు తీసి పంపించే టెక్నాలజీని సాధించిన మనుషులకు ఈ పేల్ బ్లూ డాటే ఇల్లు మరి. అందుకే ఈ ఫోటో చరిత్రలో నిలిచిపోయింది.
సరే కేవలం గ్రహాల ఫోటోలు తీయటానికి కాదు కదా వాయేజర్స్ ని పంపింది. అసలు లక్ష్యం ఇంకా ఉంది. అదే గోల్డెన్ రికార్డ్. బంగారు రంగులో చిన్న చక్రంలా కనిపిస్తున్న ఇదే గోల్డెన్ రికార్డ్. వాయేజర్ 1కి, 2కి ఈ బంగారు ప్లేట్ ను అమర్చారు. మన భూమిని రిప్రజెంట్ చేసే అన్ని రకాల విషయాలను ఈ గోల్డెన్ రికార్డ్ లోకి ఎక్కించారు. లైక్ మన భూమి మీద అద్భుతమైన ప్రదేశాలు, పిల్లాడికి పాలు పట్టే తల్లి ఫోటో, పసిపిల్లాడు ఏడ్చే ఏడుపు, మనుషుల బాడీ పార్ట్స్ ఫోటోలు, జంతువుల చిత్రాలు, మన మ్యాథ్స్ ఫార్మూలాలు, మన సూపర్ మార్కెట్లు, అందమైన నదులు, రోడ్ మీద ట్రాఫిక్, తాజ్ మహల్ ఇలా 115 ఫోటోలను ఈ గోల్డెన్ రికార్డ్ లో నిక్షిప్తం చేశారు. అంతే కాదు 27 దేశాలకు చెందిన 27 భాషల్లో పాటలను ఈ గోల్డెన్ రికార్డులో నిక్షిప్తం చేశారు. మన దేశం నుంచి ఓ హిందీ పాటను కూడా పంపారు. అంతే కాదు హిందీ, తెలుగు, తమిళంసహా 55 భాషల్లో భూమి నుంచి మీకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం అనే సందేశాలను గోల్డెన్ రికార్డ్ లో నిక్షిప్తం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా మన భూమి ఉండే అడ్రస్ ఎక్కడ..సూర్య కుటుంబంలో మన భూమి ఎక్కడ ఉందో అర్థమయ్యేలా ఇలా పల్సర్స్ లో సింబల్స్ లా వేశారు.
ఈ గోల్డెన్ రికార్డ్ ను ఎలా ఓపెన్ చేయాలి...ఇందులో ఉన్నవి ఎలా చదవాలో అర్థం చేసుకునేలా కోడ్ లాంగ్వేజ్ తోనూ బొమ్మలు గీశారు. అలా గోల్డెన్ రికార్డులను మోసుకుంటూ 48ఏళ్లుగా ఈ అనంతమైన విశ్వంలో అంతులేని ప్రయాణాన్ని ప్రారంభించాయి వాయేజర్స్. తొలుత ఒక ఆరేడేళ్లు పనిచేస్తాయేమో అనుకున్న స్పేస్ క్రాఫ్ట్స్ కాస్తా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయేలా 48ఏళ్లు గడుస్తున్నా ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. 25 బిలియన్ కిలోమీటర్ల దూరం అంటే 2500కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేశాయి. మన సౌర కుటుంబాన్ని దాటేసి రెండు స్పేస్ క్రాఫ్ట్స్ కూడా ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లోకి వెళ్లిపోయాడు. ఇప్పటికి ఈ క్షణానికి కూడా గంటకు 60వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ నాసా సెంటర్ తో కమ్యూనికేట్ అవుతూనే ఉంటూ ఆశ్చర్యపరుస్తున్నాయి. భవిష్యత్తులో వాటి బ్యాటరీస్ అయిపోయినా...లేదా స్పేస్ క్రాఫ్ట్స్ పాడైనా కూడా సెకనుకు 15కిలోమీటర్ల వేగంతో ఎలాంటి ఆటంకాలు వాటి ప్రయాణం సాగుతూనే ఉండేలా డిజైన్ చేశారు.
మన కంటే తెలివైన లేదా మనతో సరిసమానమైన ఏదో ఏలియన్ సమాజం లోని బుద్ధి జీవులు ఆ వాయేజర్స్ ను ఆపి అందులో ఏమున్నాయో చదివి అర్థం చేసుకోగలిగితే కొన్ని వందల సంవత్సరాల తర్వాతైనా భూమితో కాంటాక్ట్ అయ్యేందుకు యత్నిస్తాయని..ఫలితంగా ఈ అనంతమైన విశ్వంలో ఒంటరి వాళ్లలా మనం మాత్రమే లేవని...వాళ్ల టెక్నాలజీని మనం అర్థం చేసుకోవటమే లేదా మనకు తెలిసింది వాళ్లకు నేర్పటమే చేసే ఓ స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరుచుకుని మానవాళిని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే శాస్త్రవేత్తల అలుపెరగని లక్ష్యాలను, కొన్ని కోట్ల మంది ఆశలను మోసుకుంటూ ఈ అనంతమైన విశ్వంలో వాయేజర్స్ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.





















